కోహ్లి గురించి మాల్యా ఏమన్నారంటే... | I didn't realise I was picking the best batsman in the World: Mallya on Kohli | Sakshi
Sakshi News home page

కోహ్లి గురించి మాల్యా ఏమన్నారంటే...

Published Mon, Mar 28 2016 9:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

కోహ్లి గురించి మాల్యా ఏమన్నారంటే...

కోహ్లి గురించి మాల్యా ఏమన్నారంటే...

లండన్: మాస్టర్ ఇన్నింగ్స్ తో టీమిండియాకు విజయాన్ని అందించిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లికి ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందలు తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ను విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ సమరంగా వర్ణించారు. టీ20 వరల్డ్ కప్ లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత తన అభిప్రాయాలను ట్విటర్ లో పోస్ట్ చేశారు.

'అండర్-19 ఆటగాడిని ఉన్న కోహ్లిని ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులోకి తీసుకున్నప్పుడు మాకు తెలియలేదు... మేము తీసుకున్నది ప్రపంచలోనే బెస్ట్ బ్యాట్స్ మన్ ని అని. కంగ్రాట్స్. ముంబైలో జరగనున్న సెమీఫైనల్ లో ఇద్దరు యోధులు గేల్, కోహ్లి హోరాహోరీగా తలపడనున్నారు. రెండు టీమ్ లకు నా శుభాకాంక్షలు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడుతున్న విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, భారత విధ్వంసక బ్యాట్స్ మన్ రానున్న సీజన్ లో సత్తా చాటాల'ని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు.

ఆదివారం నాగపూర్ లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను ఉత్కంఠతో వీక్షించానని వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆర్సీబీ తరపున ఐపీఎల్ లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement