chasing record
-
కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల ఛేదన
తుఫాను వచ్చేముందు ప్రశాంతత ఉంటుందంటారు. అయితే ఒక్కసారి వర్షం మొదలయ్యాకా వచ్చే ఉరుములు, మెరుపులు మనల్ని ఉలికిపాటుకు గురి చేస్తాయి. అచ్చం అలాంటి తుఫాను ఇన్నింగ్స్ టి20 బ్లాస్ట్ 2023 టోర్నీలో నమోదైంది. కొడితే సిక్సర్.. లేదంటే బౌండరీ అనేలా స్టేడియం పరుగుల జడివానలో తడిసి ముద్దయింది. టోర్నీలో భాగంగా సౌత్ గ్రూప్‌లో ఉన్న సర్రీ, మిడిలెసెక్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.. సర్రీ జట్టు విధించిన 253 పరుగుల భారీ టార్గెట్‌ను మిడిలెసెక్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించడం విశేషం. ఇరుజట్లలో ఎవరు సెంచరీలు చేయకపోయినప్పటికి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో మొత్తంగా 52 బౌండరీలు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. టి20 బ్లాస్ట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించగా.. ఓవరాల్‌గా టి20 చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్ జాక్స్ (45 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. లారి ఎవన్స్ (37 బంతుల్లో 85 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మినహా మిగతావారి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రాలేదు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. వచ్చినోళ్లు వచ్చినట్లు కసితీరా బాదారు. తొలుత ఓపెనర్లు స్టీఫెన్ ఎస్కినాజి(39 బంతుల్లో 73 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్), జో క్రాక్నెల్(16 బంతుల్లో 36 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్ హోల్డన్(35 బంతుల్లో 68 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ హిగ్గిన్స్(24 బంతుల్లో 48 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో జాక్ డేవిస్ 3 బంతుల్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. Utterly extraordinary 😲@Middlesex_CCC had lost their previous 14 Blast matches and have just chased down 253 🤯#Blast23 pic.twitter.com/NxeweZyKOh — Vitality Blast (@VitalityBlast) June 22, 2023 చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! -
టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ చెత్త రికార్డు.. ఏడేళ్లలో నాలుగోసారి
ఆసియా కప్ 2022లో సూపర్-4 లీగ్ దశలో అఫ్గానిస్తాన్‌పై శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో అఫ్గాన్ చేతిలో ఎదురైన ఓటమికి లంక బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్లో అఫ్గాన్ జట్టు చెత్త రికార్డు నమోదు చేసింది. 2015 నుంచి చూసుకుంటే అఫ్గాన్‌పై ఒక జట్టు అత్యధిక పరుగులను చేజింగ్ చేయడం ఇది నాలుగోసారి. ఇక అఫ్గాన్‌పై భారీ లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా శ్రీలంక నిలిచింది. తాజా మ్యాచ్‌లో లంక అఫ్గాన్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంతకముందు ఇదే ఏడాది బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్.. చేజింగ్‌లో 169 పరుగులు చేసి గెలిచింది. అంతకముందు రెండు సందర్భాల్లో హాంకాంగ్ జట్టు అఫ్గానిస్తాన్‌పై 163, 162 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇక తాజాగా షార్జా వేదికగా శ్రీలంక తమ టి20 క్రికెట్లో భారీ లక్ష్యాన్ని చేధించి రికార్డు నమోదు చేసింది. ఇక ఇదే ఆసియాకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో లంక భారీ లక్ష్యాలను చేధించింది. బంగ్లాదేశ్‌పై 184 పరుగుల చేజింగ్‌తో పాటు.. తాజాగా అఫ్గాన్‌పై 176 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: AFG Vs SL Super-4: ఆఖర్లో వచ్చి అదరగొట్టిన రాజపక్స.. లంక ప్రతీకార విజయం -
లక్ష్య ఛేదనలో టీమిండియా కొత్త రికార్డు..
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టి20లో ఓటమి పాలైనప్పటికి ఒక్కరోజు వ్యవధిలోనే ఆ చేదు ఫలితాన్ని మరిపించేలా టీమిండియా ఘన విజయం అందుకుంది. ఈ క్రమంలోనే లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా టి20 క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 2019 జూలై నుంచి చూసుకుంటే భారత్ 21 మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. ఇందులో 19 సార్లు విజయాలు సాధించిన భారత్.. కేవలం రెండుసార్లు మాత్రమే ఓటములు చవిచూసింది. ఇక సెంట్కిట్స్ వేదికలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన భారత్ పేరిట నమోదైంది. 165 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంతకముందు 2017 ఆగస్టులో అప్గనిస్తాన్‌పై విండీస్ చేధించిన 147 పరుగుల టార్గెట్ ఇంతవరకు అత్యుత్తమంగా ఉంది. తాజాగా ఆ రికార్డును టీమిండియా సవరించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో రిషబ్ పంత్(26 బంతుల్లో 33 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు వెస్టిండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ (50 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మేయర్స్, బ్రాండన్ కింగ్ (20 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఓపెనింగ్ వికెట్‌కు 57 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్నిచ్చారు. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), హెట్‌మైర్ (12 బంతుల్లో 20; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ముందు విండీస్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టి20 శనివారం(ఆగస్టు 6న) జరగనుంది. -
ఛేజింగ్ స్టార్... సగటు సూపర్!
మొహాలి: సవాలుకు సిసలైన సవాల్ విరాట్ కోహ్లి. కిష్లపరిస్థితుల్లో అతడి బ్యాట్ మరింత పదుకెక్కుతుంది. టీ20 వరల్డ్ కప్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ విహారంతో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయం చేశాడు. 'ఛేజింగ్ స్టార్'గా తనకు ఇచ్చిన బిరుదుకు సార్థకత చేకూర్చాడు. ఛేదనలో తిరుగులేని క్రికెటర్ గా మరోసారి వ్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ బ్యాటింగ్ లో రికార్డును మెరుగు పరుచుకున్నాడు. ఛేజింగ్ లో అతడి సగటు సెంచరీకి చేరువగా ఉండడమే ఇందుకు నిదర్శనం. టీ20ల్లో ఇప్పటివరకు 19 మ్యాచుల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి 91.8 యావరేజ్ తో 918 పరుగులు సాధించాడు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ ఒక్కడే అతడి కంటే ముందున్నాడు. మెక్ కల్లమ్ 38 మ్యాచుల్లో 1,006 పరుగులు చేశాడు. విజయవంతమైన ఛేదనల్లో కోహ్లి బ్యాటింగ్ సగటు సెంచరీ దాటేసింది. 15 ఇన్నింగ్స్ లో 122.83 సగటుతో 737 పరుగులు బాదాడు. ఇందులో 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. 12సార్లు అతడి హాఫ్ సెంచరీలతోనే టీమిండియా విజయం సాధించింది. ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్ లు ఆడిన కోహ్లి 55.42 సగటుతో 1552 పరుగులు చేశారు. టీ20ల్లో 15 హాఫ్ సెంచరీలు చేసిన క్రిస్ గేల్, మెక్ కల్లమ్ సరసన కోహ్లి నిలిచాడు. కాగా, విరాట్బలి.. ఆస్ట్రేలియా బలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన కోహ్లి ఫొటో హల్ చల్ చేస్తోంది.