
ఆసియా కప్ 2022లో సూపర్-4 లీగ్ దశలో అఫ్గానిస్తాన్‌పై శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో అఫ్గాన్ చేతిలో ఎదురైన ఓటమికి లంక బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్‌లో అఫ్గాన్ జట్టు చెత్త రికార్డు నమోదు చేసింది. 2015 నుంచి చూసుకుంటే అఫ్గాన్‌పై ఒక జట్టు అత్యధిక పరుగులను చేజింగ్ చేయడం ఇది నాలుగోసారి. ఇక అఫ్గాన్‌పై భారీ లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా శ్రీలంక నిలిచింది. తాజా మ్యాచ్‌లో లంక అఫ్గాన్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇంతకముందు ఇదే ఏడాది బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్.. చేజింగ్‌లో 169 పరుగులు చేసి గెలిచింది. అంతకముందు రెండు సందర్భాల్లో హాంకాంగ్ జట్టు అఫ్గానిస్తాన్‌పై 163, 162 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇక తాజాగా షార్జా వేదికగా శ్రీలంక తమ టి20 క్రికెట్‌లో భారీ లక్ష్యాన్ని చేధించి రికార్డు నమోదు చేసింది. ఇక ఇదే ఆసియాకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో లంక భారీ లక్ష్యాలను చేధించింది. బంగ్లాదేశ్‌పై 184 పరుగుల చేజింగ్‌తో పాటు.. తాజాగా అఫ్గాన్‌పై 176 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.
చదవండి: AFG Vs SL Super-4: ఆఖర్లో వచ్చి అదరగొట్టిన రాజపక్స.. లంక ప్రతీకార విజయం