
ఆసియాకప్ 2022లో సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు) మెరుపులు మెరిపించాడు. 46 పరుగుల వద్ద అఫ్గన్ తొలి వికెట్ కోల్పోయినప్పటికి ఆ తర్వాత రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్(38 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు) రాణించారు. ఇద్దరి మధ్య దాదాపు 100 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే చివర్లో వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో అఫ్గానిస్తాన్ స్కోరు తగ్గింది. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ 2, అస్తిత ఫెర్నాండో, దిల్షాన్ మదుషనక తలా ఒక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment