షార్జా: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ సూపర్–4 దశ తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో బ్యాటర్స్ అంతా సమిష్టిగా రాణించడంతో లంక విజయాన్ని అందుకుంది. అయితే ఆఖర్లో బానుక రాజపక్స (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన వారిలో నిసాంక (35; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు సాధించింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఇబ్రహీమ్ జద్రాన్ (40; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ 2, అస్తిత ఫెర్నాండో, దిల్షాన్ మదుషనక తలా ఒక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment