
కుప్పకూలిన పాక్ టాపార్డర్
మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు టాపార్డర్ కుప్పకూలింది. ఆరుఓవర్లు ముగిసేసరికి పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేసింది. పాక్ జట్టు 12 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. అల్ అమిన్ హుస్సేన్ తన తొలి బంతికే ఓపెనర్ ఖుర్రం మంజూర్(1) ను వెనక్కి పంపాడు. చాలా ఎత్తులో వస్తున్న బంతిని కీపర్ ముష్ఫికర్ రహీమ్ క్యాచ్ పట్టడంతో ఖుర్రం పెవిలియన్ కు చేరాడు.
నాలుగో ఓవర్ ఐదో బంతికి మరో ఓపెనర్ షార్జిల్ ఖాన్(10) ఓటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన సర్ఫరాజ్ అహ్మద్ రావడంతోనే ఫోర్ కొట్టి ధీమాగా కనిపించాడు. ఆరాఫత్ సన్నీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 12 పరుగుల వద్ద మరో ఓపెనర్ షార్జిల్ ఖాన్(10) రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన మొర్తాజా తన తొలి ఓవర్లోనే పాక్ కు షాకిచ్చాడు. మహ్మద్ హహీజ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ అహ్మద్ (6), ఉమర్ అక్మల్ (1) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మొర్తాజా, అమిద్ అల్ హసన్, ఆరాఫత్ సన్నీ తలో వికెట్ తీశారు.