Senior Women’s Inter-Zone T20 Trophy: సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్ నుంచి గొంగడి త్రిష, భోగి శ్రావణి ఎంపికయ్యారు.
అదే విధంగా ఆంధ్ర నుంచి బారెడ్డి అనూష, ఎస్.అనూష, నీరగట్టు అనూష ఈ జట్టులో స్థానం సంపాదించారు. ఇక ఈ టోర్నీ ఈనెల 24 నుంచి డిసెంబర్ 4 వరకు లక్నోలో జరుగుతుంది. ఈ జట్టుకు శిఖా పాండే కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
సౌత్‌జోన్ జట్టు: శిఖా పాండే (కెప్టెన్), గొంగడి త్రిష, డి.బృందా, జి.దివ్య, ఎల్.నేత్ర, పూర్వజ వెర్లేకర్, దృశ్య, ఎంపీ వైష్ణవి, మిన్ము మణి (వైస్ కెప్టెన్), అనూష బారెడ్డి, ఎస్.అనూష, ఎండీ షబ్నం, బూగి శ్రావణి, ఎన్.అనూష, యువశ్రీ.
సెమీస్‌లో అభయ్ నిష్క్రమణ
న్యూఢిల్లీ: నియోస్ వెనిస్ వెర్టె ఓపెన్ స్క్వాష్ టోర్నీలో భారత ప్లేయర్ అభయ్ సింగ్ సెమీఫైనల్లో ని్రష్కమించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోరీ్నలో శుక్రవారం రెండో సీడ్ రోరీ స్టీవర్ట్ (స్కాట్లాండ్)తో జరగాల్సిన సెమీఫైనల్లో అభయ్ గాయం కారణంగా బరిలోకి దిగకుండా తన ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. క్వార్టర్ ఫైనల్లో అభయ్ 11–1, 7–11, 19–17, 8–11, 11–6తో ఆరో సీడ్ విక్టర్ బైర్టస్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment