
Babar Azam Smashes Pitch Out Of Frustration: పాక్‌లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో భాగంగా నార్త్‌రన్ పంజాబ్, సెంట్రల్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సెంట్రల్ పంజాబ్ ఓపెనర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎన్నడూ లేని విధంగా సహనం కోల్పోయి బ్యాట్‌తో నేలకేసి గట్టిగా కొట్టాడు. ప్రత్యర్ధి బౌలర్ ఇమాద్ వసీంను సమర్థవంతంగా ఎదుర్కోలేక బాబర్ ఈ అనూహ్య చర్యకు పాల్పడ్డాడు. అనంతరం సెంచరీతో చెలరేగిన అతను.. తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన బాబర్.. 63 బంతుల్లో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బాబర్ ధాటికి సెంట్రల్ పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 200 పరుగులు చేసింది. అనంతరం హైదర్ అలీ (53 బంతుల్లో 91) విధ్వంసం ధాటికి నార్త్‌రన్ పంజాబ్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, ఈ టీ20 టోర్నీలో బాబర్ ఆజమ్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో 71.50 సగటుతో 286 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్‌లు అక్టోబర్ 24న తలపడనున్నారు.
చదవండి: బాలీవుడ్‌లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్ట్ చేయనున్న కరణ్ జోహార్..?
Comments
Please login to add a commentAdd a comment