పాకిస్తాన్ వీధి క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ పోస్ట్ చేసిన ఈ వీడియోలో కొందరు పాక్ యువకులు వినూత్నంగా క్రికెట్ ఆడుతూ కనిపించారు. వీధి లైట్ల వెలుతురులో సాగే ఈ గేమ్‌లో బౌలర్ బంతిని విసరకముందే బ్యాటర్ సగం క్రీజ్ వరకు వచ్చి గాల్లో ఉన్న బంతిని షాట్ ఆడి పరుగు పూర్తి చేస్తాడు.
Outrageous shot in street cricket in Pakistan 🔥 pic.twitter.com/1mvq5V4z9t
— England's Barmy Army (@TheBarmyArmy) April 5, 2023
ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవ్వరి వల్ల కాదు. బ్యాటర్ బంతిని ఎదుర్కొన్న విధానం చూసి క్రికెట్ ఇలా కూడా ఆడవచ్చా అని నెటిజన్లు సరదాగా చర్చించుకుంటున్నారు. కొందరేయో ఇలాంటి క్రికెట్ ఆడటం పాకిస్తాన్‌లో మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు. మొత్తానికి ఫన్నీగా సాగే ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లచే నవ్వులు పూయిస్తుంది.
ఇదిలా ఉంటే, షార్జా వేదికగా ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాభవాన్ని (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి) ఎదుర్కొన్న పాకిస్తాన్.. ఏప్రిల్ 14 నుంచి న్యూజిలాండ్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సమాయత్తమవుతోంది. 5 టీ20లు, 5 వన్డేల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది.
ఏప్రిల్ 14, 15, 17, 20, 24 తేదీల్లో టీ20లు.. ఏప్రిల్ 27, 29, మే 3, 5, 7 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇదివరకే జట్లను కూడా ప్రకటించాయి. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ద్వితియ శ్రేణి జట్టును పంపించి చేతులు కాల్చుకున్న పీసీబీ.. కివీస్‌తో సిరీస్‌కు అలాంటి తప్పు చేయకుండా బాబర్ నేతృత్వంలలోని రెగ్యులర్ జట్టును ఎంపిక చేసింది. మరోవైపు న్యూజిలాండ్ టామ్ లాథమ్ నేతృత్వంలో యువ జట్టుతో పాక్‌ను సొంతగడ్డపై ఢీకొట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment