గతేడాది వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా (బంగ్లాదేశ్‌తో మ్యాచ్) గాయపడిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్-2024లో హార్దిక్ రిలయన్స్ 1 జట్టు తరఫున బరిలోకి దిగాడు. 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో హర్దిక్ రిలయన్స్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
బీపీసీఎల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ రెండు వికెట్లు తీయడంతో పాటు తన జట్టును ఉపయోగపడే అతి మూల్యమైన పరుగులు చేశాడు. ఛేదనలో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్.. 4 బంతుల్లో 3 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బీపీసీఎల్ 15 ఓవర్లలో 126 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్య ఛేదనకు తడబడిన హార్దక్ సేన 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద విజయం సాధించింది.
హార్దక్ ప్రాతినిథ్యం వహిస్తున్న రిలయన్స్ జట్టులో నేహల్ వధేరా, తిలక్ వర్మ, పియూశ్ చావ్లా లాంటి ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్ ట్రేడింగ్‌లో హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ గుజరాత్ నుంచి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై యాజమాన్యం రోహిత్‌ను తప్పించి.. వచ్చీ రాగానే హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించింది. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం హార్దిక్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. హార్దిక్ ముంబై గూటికి చేరడంతో అతని స్థానంలో గుజరాత్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment