dy patil
-
విధ్వంసం సృష్టించిన శిఖర్ ధవన్.. ఐపీఎల్‌కు ముందు ప్రత్యర్దులు హడల్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఫామ్‌లోకి వచ్చాడు. డీవై పాటిల్ టీ20 టోర్నీలో డీవై పాటిల్ బ్లూ జట్టుకు ఆడుతున్న గబ్బర్.. సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా డీవై పాటిల్ బ్లూ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గబ్బర్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ జట్లు హడలిపోతున్నాయి. ధవన్ ఇదే భీకర్ ఫామ్‌ను కొనసాగిస్తే తిప్పలు తప్పవని మదనపడుతున్నాయి. బ్లూ జట్టులో గబ్బర్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. ఓపెనర్ అభిజిత్ తోమర్ (20 బంతుల్లో 31 పరుగులు), అయాజ్ ఖాన్ (9 బంతుల్లో 16), పరిక్షిత్ (6 బంతుల్లో 11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సీఏజీ బౌలర్లలో సన్వీర్ సింగ్, రిత్విక్ చటర్జీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రధాన్, అంకిత్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఏజీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుణ్ లవండే (70) అర్దసెంచరీతో రాణించగా.. సన్వీర్ సింగ్ (48 నాటౌట్), ఆబిద్ ముస్తాక్ (17 నాటౌట్) సీఏజీని విజయతీరాలకు చేర్చారు. సీఏజీలో సంజయ్ 11, సేనాపతి 4, సచిన్ బేబీ 20 పరుగులు చేశారు. బ్లూ బౌలర్లలో విపుల్ కృష్ణన్ 2, కర్ష్ కొఠారి ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో సీఏజీ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవాళే జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ అయిల్ జట్టు టాటా స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొంది సెమీస్‌కు చేరింది. ఈ టోర్నీలో మరో రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళే జరుగనున్నాయి. -
శిఖర్ ధావన్ విధ్వంసం.. చెలరేగిన దినేష్ కార్తీక్
డివై పాటిల్ టీ20 కప్-2024లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగాడు. ఈ టోర్నీలో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సత్తాచాటాడు. డివై పాటిల్ బ్లూ జట్టు విజయంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు. 9 వికెట్ల తేడాతో ఆర్సీఐని బ్లూ జట్టు చిత్తు చేసింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్బీఐ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆర్బీఐ బ్యాటర్లలో ప్రణయ్ శర్మ(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాటిల్ బ్లూ జట్టులో పరీక్షిత్ వల్సంకర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. కొథారీ 3 వికెట్లు పడగొట్టాడు. -
రీ ఎంట్రీలో చెలరేగిన శిఖర్ ధావన్.. అయినా పాపం! ఒకే ఒక్క పరుగు
టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖన్ ధావన్ ఏడాది తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. డివై పాటిల్ టీ20 కప్‌లో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం పూణే వేదికగా టాటా స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లుతో 39 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ధావన్ ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో డివై పాటిల్ బ్లూ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టాటా స్పోర్ట్స్ క్లబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాటా బ్యాటర్లలో అపూర్వ వాంఖడే(83) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డివై పాటిల్ బ్లూ బౌలర్లలో కెప్టెన్ విపుల్ కృష్ణణ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో తమ విజయానికి కేవలం ఒక్కపరుగు దూరంలో డివై పాటిల్ బ్లూ జట్టు నిలిచిపోయింది. చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజం..!? -
రెచ్చిపోయిన తిలక్ వర్మ.. కేవలం 43 బంతుల్లోనే..!
నవీ ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20లో టోర్నీలో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో రిలయన్స్ 1 జట్టుకు ఆడుతున్న తిలక్.. సెంట్రల్ రైల్వే టీమ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న రిలయన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్.. సహచరుడు శివాలిక్‌తో కలిసి 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు రిలయన్స్ 1 స్టార్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. రెండు రోజుల కిందట ఇదే టోర్నీతో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ రెండో మ్యాచ్‌లోనే జట్టులో కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ మళ్లీ గాయం బారిన పడ్డాడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. హార్దిక్, తిలక్ ఇద్దరు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్న విషయం తెలిసిందే. చదవండి: హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే..! -
రీఎంట్రీలో పేలని పాకెట్ డైనమైట్
దాదాపు మూడు నెలల విరామానంతరం కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. రీఎంట్రీలో తుస్సుమనిపించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్.. రూట్ మొబైల్ లిమిటెడ్ జట్టుతో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌కు మెరుపు అరంభమే లభించినప్పటికీ.. ఆతర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసిన అతను.. మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన ఇషాన్.. వికెట్‌కీపింగ్‌లో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను ఇద్దరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. సుమిత్ క్యాచ్ పట్టిన ఇషాన్.. సయన్ మొండల్‌ను స్టంపౌట్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రూట్ మొబైల్ లిమిటెడ్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 193 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇషాన్ జట్టు ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఇషాన్... టీమిండియా తరఫున తన చివరి టీ20ని 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి సిరీస్ మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆతర్వాత రంజీల్లో ఆడి ఫామ్‌ను నిరూపించుకోవాలని బీసీసీఐతో పాటు చాలా మంది మాజీలు సూచించినా పెడచెవిన పెట్టిన ఇషాన్.. తాజాగా బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దిగొచ్చి స్థానిక డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఇషాన్ తీరుతో గుర్రుగా ఉన్న బీసీసీఐ అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే..!
గతేడాది వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా (బంగ్లాదేశ్‌తో మ్యాచ్) గాయపడిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్-2024లో హార్దిక్ రిలయన్స్ 1 జట్టు తరఫున బరిలోకి దిగాడు. 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో హర్దిక్ రిలయన్స్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బీపీసీఎల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ రెండు వికెట్లు తీయడంతో పాటు తన జట్టును ఉపయోగపడే అతి మూల్యమైన పరుగులు చేశాడు. ఛేదనలో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్.. 4 బంతుల్లో 3 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బీపీసీఎల్ 15 ఓవర్లలో 126 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్య ఛేదనకు తడబడిన హార్దక్ సేన 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద విజయం సాధించింది. హార్దక్ ప్రాతినిథ్యం వహిస్తున్న రిలయన్స్ జట్టులో నేహల్ వధేరా, తిలక్ వర్మ, పియూశ్ చావ్లా లాంటి ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్ ట్రేడింగ్‌లో హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ గుజరాత్ నుంచి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై యాజమాన్యం రోహిత్‌ను తప్పించి.. వచ్చీ రాగానే హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించింది. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం హార్దిక్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. హార్దిక్ ముంబై గూటికి చేరడంతో అతని స్థానంలో గుజరాత్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. -
ఐపీఎల్ మూడ్‌లోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హార్డ్ హిట్టర్ దినేశ్ కార్తీక్.. ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందే ఆ మూడ్‌లోకి వచ్చాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం ఉంటున్న డీకే.. డీవై పాటిల్ టీ20 కప్-2023 సూపర్ లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆర్బీఐతో జరిగిన మ్యాచ్‌లో డీవై పాటిల్ గ్రూప్-బి జట్టు తరఫున బరిలోకి దిగిన డీకే.. 38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 75 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన జట్టు 25 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన డీకే.. పూనకం వచ్చినట్లు ఊగిపోయి, ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీ.. డీకే తదితర ఐపీఎల్ క్రికెటర్లకు బాగా ఉపయోగపడనుంది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డీవై పాటిల్ గ్రూప్-బి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించగా.. ఛేదనలో ఆర్బీఐ టీమ్ కోటా ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమై 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డీవై పాటిల్ ఇన్నింగ్స్‌లో దినేశ్ కార్తీక్ (75 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. హార్ధిక్ తామోర్ (28), యశ్ ధుల్ (29), శశాంక్ సింగ్ (23) ఓ మోస్తరుగా రాణించారు. ఆర్బీఐ బౌలర్లలో అలీ ముర్తుజా 2, షాబాజ్ నదీమ్, అంకిత్ రాజ్‌పుత్, సాయన్ మొండల్ చెరో వికెట్ పడగొట్టారు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్బీఐ.. బల్తేజ్ సింగ్ (3/33), వినీత్ సిన్హా (3/34), సాగర్ ఉదేశీ (1/24) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్బీఐ ఇన్నింగ్స్‌లో సుమిత్ (49), జ్యోత్ (35), రాజేశ్ బిష్ణోయ్ (33) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాగా, దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కీలక పోరుకు సిద్దమైన సీఎస్కే, ఎస్ఆర్హెచ్.. తొలి విజయం ఎవరిది!
ఐపీఎల్-2022లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. డివై పాటెల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లు ఇప్పటివరకు ఈ సీజన్లో బోణీ కొట్టలేదు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐపీఎల్-2022లో తొలి విజయాన్ని నమోదు చేయాలని ఇరు జట్లు భావిస్తోన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఏంటో పరిశీలిద్దాం. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో ఆ జట్టు కాస్త తడబడుతోంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్కు ఘనమైన ఆరంభం లభించడంలేదు. కెప్టెన్ విలియమ్సన్ రాణించాల్సిన అవసరం ఆ జట్టుకు ఎంతో ఉంది. అదే విధంగా మిడిలార్డర్లో రాహుల్ త్రిపాఠి, మాక్రమ్, పూరన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో త్రిపాఠి, పూరన్ అద్భుతంగా రాణించారు. ఇక బౌలింగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ పటిష్టంగా కన్పిస్తోంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పరుగులు భారీగా సమర్పించుకున్న ఎస్ఆర్హెచ్ బౌలర్లు.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో తిరిగి గాడిలో పడ్డారు. టి.నటరాజన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓటమి పాలైంది. బ్యాటింగ్ పరంగా సీఎస్కే పటిష్టంగా కన్పిస్తోంది. ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కాస్త ఇబ్బంది పెట్టే విషయం. రాబిన్ ఊతప్ప, మెయిన్ అలీ, రాయుడు, దోని అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక చెన్నై బౌలర్లు అతంగా రాణించలేకపోతున్నారు. దీపక్ చహార్ లేని లోటు సీఎస్కేలో సృష్టంగా కన్పిస్తోంది. కాగా డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, డ్వేన్ ప్రిటోరియస్ వంటి అంతర్జాతీయ బౌలర్లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో చెన్నై బరిలోకి దిగే అవకాశం ఉంది. తుషార్ దేశ్ పాండే స్థానంలో రాజ్‌వర్దన్ హాంగేర్కార్కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఇరు జట్లు ఐపీఎల్లో ఇప్పటి వరకు 17 సార్లు తలపడగా.. చెన్నై 13 మ్యాచ్‌ల్లో గెలవగా, ఎస్ఆర్హెచ్ కేవలం 4 సార్లు మాత్రమే విజయం సాధించింది. తుది జట్లు (అంచనా): సన్‌రైజర్స్ హైదరాబాద్: రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, మహేష్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, రాజ్ హంగర్గేకర్. -
హార్దిక్ నామస్మరణతో మార్మోగిన స్టేడియం
నవీ ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా డీవై పాటిల్ టి20 క్రికెట్ కప్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. గత మంగళవారం 39 బంతుల్లో 105 పరుగులు చేసిన అతను... శుక్రవారం బీపీసీఎల్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. రిలయన్స్ వన్ జట్టు తరఫున ఆడుతున్న పాండ్యా 55 బంతుల్లోనే 20 సిక్స్‌లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతోపాటు టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు. పాండ్యా విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన రిలయన్స్ వన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బీపీసీఎల్ 134 పరుగులకే ఆలౌటై... 104 పరుగుల తేడాతో ఓడింది. (హార్దిక్ చితక్కొట్టుడు మామూలుగా లేదు!) అయితే నిన్నటి మ్యాచ్ తర్వాత డీవై పాటిల్ స్టేడియం హార్దిక్ నామస్మరణతో మార్మోగింది. స్టేడియంలోకి దూసుకొచ్చిన వేల సంఖ్యలో అభిమానులు హార్దిక్.. హార్దిక్ అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే రిలయన్స్-1 డ్రెస్సింగ్ రూమ్‌కు వద్దకు వెళ్లి మరీ హార్దిక్ నామస్మరణ చేశారు. ఆడేది దేశవాళీ మ్యాచ్ అయినా తమ అభిమానం ఇలానే ఉంటుందని ఫ్యాన్స్ చెప్పకనే చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదొక మంచి ప్లాట్‌ఫామ్.. తాను ఫిట్నెస్ను నిరూపించుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్ అని హార్దిక్ మ్యాచ్ తర్వాత స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన శరీరం ఎలా ఉందో పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణావకాశమన్నాడు. ఈ టోర్నీలో ఎలా ఆడాలని సిద్ధమయ్యానో దాన్ని నిజం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అయితే ఇందు కోసం ముందస్తు ప్రణాళిక ఏమీ లేదన్నాడు. క్రీజ్‌లోకి దిగిన తర్వాత పరిస్థితిని బట్టి బ్యాట్ ఝుళిపించానని పాండ్యా చెప్పుకొచ్చాడు. గతేడాది సెప్టెంబర్‌లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన పాండ్యా ఆ తర్వాత వెన్నుగాయంతో జట్టుకు దూరమయ్యాడు. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత పాండ్యా సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్నాడు. తాజాగా డీవై కప్‌లో బరిలోకి దిగి తన ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. దాంతో భారత్ ఆడబోయే తదుపరి టోర్నీల్లో ఆడేందుకు పాండ్యా సిద్ధమయ్యాడు. (హార్దిక్ బాదుడే బాదుడు) What crowds post the DY Patil t20 Cup! All rooting for just one man @hardikpandya7 #cricket pic.twitter.com/SCMWEJNmxd — Chandresh Narayanan (@chand2579) March 6, 2020 -
పాండ్యా పరాక్రమం
నవీ ముంబై: వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా డీవై పాటిల్ టి20 క్రికెట్ కప్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. గత మంగళవారం 39 బంతుల్లో 105 పరుగులు చేసిన అతను... తాజాగా శుక్రవారం బీపీసీఎల్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. రిలయెన్స్ వన్ జట్టు తరఫున ఆడుతున్న పాండ్యా 55 బంతుల్లోనే 20 సిక్స్‌లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతోపాటు టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు. గతంలో ఈ రికార్డు శ్రేయస్ అయ్యర్ (147)పై ఉండేది. పాండ్యా విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన రిలయన్స్ వన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బీపీసీఎల్ 134 పరుగులకే ఆలౌటై... 104 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో రిలయన్స్ తరఫున ఓపెనర్‌గా దిగిన శిఖర్ ధావన్ (3) నిరాశ పరిచాడు. మ్యాచ్‌లో పాండ్యా బౌండరీల రూపంలోనే 144 పరుగులు సాధించడం విశేషం. అనంతరం బౌలింగ్ కూడా చేసిన పాండ్యా ఒక వికెట్ తీశాడు. భువనేశ్వర్ కూడా ఒక వికెట్‌తో రాణించాడు. -
హార్దిక్ చితక్కొట్టుడు మామూలుగా లేదు!
ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పూనకం వచ్చినట్లే ఆడుతున్నాడు. తనను సీనియర్ జట్టులోకి ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిదనే సంకేతాలు పంపుతూనే ఉన్నాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్ టీ20 కప్‌లో ఇప్పటికే రెండు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న హార్దిక్.. ఈసారి మాత్రం సిక్సర్లే చిన్నబోయేలా బాదేశాడు. ఏకంగా 20 సిక్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. డివై పాటిల్ కప్‌లో రిలయన్స్-1 తరఫున ఆడుతున్న హార్దిక్.. తాజాగా బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. మిడాన్ మీదుగా సిక్స్ కొట్టి శతకం పూర్తి చేసుకున్న హార్దిక్.. ఆ తర్వాత కూడా మరింత రెచ్చిపోయాడు. ఓవరాల్‌గా 55 బంతుల్లో 20 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇది ఈ టోర్నీలో హార్దిక్‌కు రెండో సెంచరీ. (హార్దిక్ బాదుడే బాదుడు) ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బీపీసీఎల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన రిలయన్స్-1 బ్యాటింగ్‌కు దిగింది. టాపార్డర్‌లో హార్దిక్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో రిలయన్స్-1 స్కోరు బోర్డుపై 238 పరుగుల్ని ఉంచింది. ఈ క్రమంలోనే టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్ రికార్డును హార్దిక్ నమోదు చేశాడు. అంతకుముందు టీ20 ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్ రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అయ్యర్ 147 పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకూ అత్యుత్తమం, కాగా దానిని హార్దిక్ బ్రేక్ చేశాడు. (హార్దిక్ రీ ఎంట్రీ అదిరింది..) -
పాండ్యా సూపర్ ఇన్నింగ్స్
ముంబై: గాయం నుంచి కోలుకొని ఫిట్‌గా మారిన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో చెలరేగాడు. డీవై పాటిల్ టి20 కప్‌లో భాగంగా రిలయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను మెరుపు సెంచరీ బాదాడు. ‘కాగ్’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా 39 బంతుల్లోనే 8 ఫోర్లు, 10 సిక్సర్లతో 105 పరుగులు సాధించాడు. పాండ్యా దూకుడుతో రిలయన్స్ 252 పరుగులు నమోదు చేయగా... 151 పరుగులే చేసిన ‘కాగ్’ జట్టు 101 పరుగులతో ఓడింది. పునరాగమనంలో పాండ్యాకు ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో పాండ్యా 25 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. గత సెప్టెంబరులో భారత్ తరఫున అతను చివరిసారిగా మ్యాచ్ (దక్షిణాఫ్రికాపై టి20) ఆడాడు. ఆ తర్వాత వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో పాల్గొని ఫిట్‌గా మారాడు. దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు పాండ్యా మళ్లీ ఎంపికయ్యే అవకాశం ఉంది. (చదవండి: అగార్కర్‌కు షాక్ ఇచ్చిన సీఏసీ) -
హార్దిక్ బాదుడే బాదుడు
నవీ ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బరిలోకి దిగిన తొలి దేశవాళీ టోర్నీలో హార్దిక్ మెరుపులు మెరిపిస్తున్నాడు. డీవై పాటిల్ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్-1 జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్ మరోసారి చెలరేగిపోయాడు. శనివారం బ్యాంక్ ఆఫ్ బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించిన హార్దిక్.. మంగళవారం సీఎజీతో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 105 పరుగులు సాధించాడు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ పరుగుల మోత మోగించాడు. ఈ క్రమంలోనే 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం మొదలు హార్దిక్ ఎదురుదాడి చేయడంతో సీఎజీ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. హార్దిక్ సెంచరీ సైతం సిక్స్ కొట్టి పూర్తి చేసుకోవడం మరో విశేషం. వి జీవరాజన్ వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్లో హార్దిక్ 26 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి. హార్దిక్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో రిలయన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్ ‘ఎ’ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ పూర్తిగా కోలుకోవడంతో ఇక టీమిండియా రీఎంట్రీ ఒక్కటే మిగిలి ఉంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు కీలక ఆటగాడైన హార్దిక్ కోలుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. -
బీహార్ సీఎంగా మంజి ప్రమాణం
23న విశ్వాస పరీక్ష పాట్నా: బీహార్ 32వ ముఖ్యమంత్రిగా జితన్ రామ్ మంజి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. 17 మంత్రులతో పాటు సీఎంగా మంజితో గవర్నర్ డీవై పాటిల్ ఇక్కడి రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. 23న ఆయన అసెంబ్లీ విశ్వాసాన్ని పొందాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. తాజాగా మంత్రి పదవులు చేపట్టిన వారందరూ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్లో మంత్రులుగా పనిచేశారు. ఆ మంత్రివర్గంలో ఒక మహిళ ఉన్నారు. కూలీ బిడ్డ నుంచి సీఎం పీఠం వరకూ... మహాదళిత్ వర్గానికి చెందిన జితన్ రామ్ మంజి 1944 అక్టోబర్ 6న గయ జిల్లాలోని మహకార్ గ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి రామ్‌జిత్ రామ్ వ్యవసాయ కూలి. జితన్కు చదువుకోవాలని కోరిక ఉన్నా భూస్వాముల ఒత్తిడితో చిన్నతనంలోనే తండ్రితో కలసి పొలంలో వెట్టిచాకిరీ చేయక తప్పేదికాదు. అయితే తండ్రి, భూస్వామి కొడుకు కోసం నియమించిన ట్యూటర్ సహాయంతో ఆయన బడికి వెళ్లకుండానే 7వ తరగతి పూర్తిచేశారు. ఆ తర్వాత హైస్కూల్లో చేరి చదువును కొనసాగించి చరిత్రలో డిగ్రీ పూర్తిచేశారు. 1968లో తపాలా శాఖలో గుమస్తా ఉద్యోగం పొందిన ఆయన, 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది ఫతేపూర్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రస్తుతం జెహానాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీనియర్ నేతకు కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీ (యూ) పార్టీల ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. ఈ ఏడాది లోక్‌సభకు పోటీ చేసిన మంజి తన ఎన్నికల అఫిడవిట్లో స్థిరచరాస్తులు కేవలం రూ. 2.83 లక్షలుగా పేర్కొని తానెంత సామాన్యుడో చెప్పకనే చెప్పారు. రబ్బర్ స్టాంప్‌ను కాదు.. అంతకుముందు మాజీ సీఎం నితీశ్ కుమార్ చేతిలో కీలుబొమ్మ అనే విమర్శను మంజి తిప్పికొట్టారు. తనను రబ్బ ర్ స్టాంప్ అని చెప్పడం ద్వారా బీజేపీ తన దళిత వ్యతిరేకతను బయటపెట్టుకుంటోందని మంజి విమర్శించారు. అయితే నితీశ్ కుమార్ సూచనలు తీసుకోవడాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. కాగా, జేడీయూ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ డీవై పాటిల్‌కు లేఖ రాసింది. దీంతో 239 సీట్ల అసెంబ్లీలో ప్రస్తుతం జేడీయూ ప్రభుత్వ బలం 124కు చేరింది. మరోపక్క బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 88కి పడిపోయింది.