
ముంబై: గాయం నుంచి కోలుకొని ఫిట్‌గా మారిన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో చెలరేగాడు. డీవై పాటిల్ టి20 కప్‌లో భాగంగా రిలయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను మెరుపు సెంచరీ బాదాడు. ‘కాగ్’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా 39 బంతుల్లోనే 8 ఫోర్లు, 10 సిక్సర్లతో 105 పరుగులు సాధించాడు. పాండ్యా దూకుడుతో రిలయన్స్ 252 పరుగులు నమోదు చేయగా... 151 పరుగులే చేసిన ‘కాగ్’ జట్టు 101 పరుగులతో ఓడింది.
పునరాగమనంలో పాండ్యాకు ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో పాండ్యా 25 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. గత సెప్టెంబరులో భారత్ తరఫున అతను చివరిసారిగా మ్యాచ్ (దక్షిణాఫ్రికాపై టి20) ఆడాడు. ఆ తర్వాత వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో పాల్గొని ఫిట్‌గా మారాడు. దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు పాండ్యా మళ్లీ ఎంపికయ్యే అవకాశం ఉంది. (చదవండి: అగార్కర్‌కు షాక్ ఇచ్చిన సీఏసీ)