ఇంగ్లండ్‌పై కివీస్‌దే గెలుపు | New Zealand beat England by 12 runs | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌పై కివీస్‌దే గెలుపు

Published Wed, Feb 14 2018 4:22 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

New Zealand beat England by 12 runs - Sakshi

కేన్‌ విలియమ్సన్‌

వెల్లింగ్టన్‌: ముక్కోణపు టి20 టోర్నీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (46 బంతుల్లో 72; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ పోరాటం 184 పరుగులకే పరిమితమైంది. అలెక్స్‌ హేల్స్‌ (24 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), మలాన్‌ (40 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి భాగస్వామ్యం అందించినా మిగతావారు విఫలమమయ్యారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ (2/46), శాన్‌ట్నర్‌ (2/29), ఇష్‌ సోధి (2/29) రాణించారు. విలియమ్సన్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ పురస్కారం దక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement