England -newzealand
-
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
Colin de Grandhomme ruled out of England tour: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమి నుంచి కోలుకోక ముందే న్యూజిలాండ్‌కు మరో ఎదరు దెబ్బ తగిలింది. గాయం కారణంగా కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గ్రాండ్‌హోమ్ తన కుడి కాలి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి 10 నుంచి 12 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే సిరీస్ ఆరంభానికి ముందే గ్రాండ్‌హోమ్‌కు బ్యాకప్‌గా హెన్రీ నికోల్స్‌ను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. కాగా నికోల్స్ ఇంగ్లండ్‌కు చేరుకున్న తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో గ్రాండ్‌హోమ్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్ తుది జట్టులోకి రానున్నాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం(జూన్14) ప్రారంభం కానుంది. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. చదవండి: Lionel Messi : మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’.. అర్జెంటీనా ఘనవిజయం -
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్..
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం వెల్లడించింది. ఇక యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభావం తర్వాత క్రిస్ సిల్వర్ వుడ్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా టెస్టు కెప్టెన్సీ నుంచి జో రూట్ కూడా తప్పుకున్నాడు. అతడి స్థానంలో బెన్ స్టోక్స్ సారథిగా ఎంపికయ్యాడు. ఇక ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్ జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచే మెక్ కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక మెక్ కల్లమ్ ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్ని నియమించడం మాకు ఆనందంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం. మెక్ కల్లమ్ రాకతో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి' -
ఇంగ్లండ్‌తో టెస్టులకు కివీస్ జట్టును ప్రకటన.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో 20 మంది సభ్యలతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. కాగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. నవంబర్ 2021లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను విలియమ్సన్ ఆడాడు. మరో వైపు దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న మైఖేల్ బ్రేస్‌వెల్, వికెట్ కీపర్ క్యామ్ ఫ్లెచర్, ఓపెనర్ హమీష్ రూథర్‌ఫోర్డ్, పేసర్లు జాకబ్ డఫీ,బ్లెయిర్ టిక్నర్కు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. ఇక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జాన్2న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్ చదవండి: IPL 2022: ఐపీఎల్లో ధావన్ అరుదైన ఫీట్.. కోహ్లి రికార్డు బద్దలు..! With the 5 players at the IPL unlikely to be available for the warm-up matches at Hove and Chlemsford, the initial squad of 20 will be reduced to 15 ahead of the 3 Tests against @englandcricket, the 1st of which begins at Lord’s on June 2. More | https://t.co/lDfWsK6mMX #ENGvNZ pic.twitter.com/FRtIowyMoi — BLACKCAPS (@BLACKCAPS) May 3, 2022 -
ఏజ్ అనేది ఓ నంబర్ మాత్రమే.. ఇప్పట్లో రిటైర్ కాను
వెల్లింగ్టన్: వయస్సనేది కేవలం ఓ నంబర్ మాత్రమేనని, దాన్ని అటతో ముడిపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టిన ఈ కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. జాతీయ జట్టుకు మరికొన్నేళ్లు అడగలిగే సత్తా తనలో ఉందని తేల్చి చెప్పాడు. 2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్న మాట వాస్తవమేనని, కానీ దానిపై పునారాలోచించుకొని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానని వెల్లడించాడు. ఆటను ఆస్వాదించగలిగినన్ని రోజులు క్రికెట్ ఆడతానని, ప్రస్తుతానికి తన ఫామ్‌కు ఏమాత్రం ఢోకా లేదని, స్థాయికి తగ్గ ప్రతిభను కనబర్చలేని రోజు స్వచ్చందంగా తప్పుకుంటానని పేర్కొన్నాడు. నేటి తరం ఆటగాళ్లు రిటైర్మెంట్పై లెక్కలేసుకోవడం మానుకోవాలని, వారిలో సత్తా ఉన్నన్ని రోజులు జట్టుకు సేవలందించడంపై దృష్టి సారించాలని సూచించాడు. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం కేన్ విలియమ్సన్ సారధ్యంలో అద్భుతంగా రాణిస్తుందని.. యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమాతూకంగా ఉందని అభిప్రాయడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ ఓ పీడకలగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ తరఫున టెస్ట్, వన్డే ఫార్మట్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన ఈ వెల్లింగ్టన్ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఈ పర్యటనలో కివీస్.. రెండు టెస్ట్‌లు ఆడనుంది. అనంతరం భారత్‌తో డబ్యూటీసీ ఫైనల్ పోరులో తలపడనుంది. చదవండి: ఇంగ్లండ్ పర్యటనలో అతను పాంటింగ్‌ను అధిగమిస్తాడు.. -
ఇంగ్లాండ్ అలా గెలిచిందట.!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య, ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూత లూగించింది. న్యూజిలాండ్‌కు గెలుపు ఖాయమనుకుంటున్న దశలో 49వ ఓవర్ మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా ఓవర్ త్రో ఇంగ్లాండ్ జట్టుకు అనూహ్యంగా పరుగులు తోడవడం కీలక పరిణామం. చివరికి టై అవ్వడం, సూపర్ ఓవర్, రెండోసారి కూడా టై అయినా కూడా ఇంగ్లాండ్ విజేతగా నిలవడం తెలిసిన సంగతే. ప్రపంచ కప్ వీక్షిస్తున్న కోట్లాది ప్రేక్షకులు ఇంకా అమోమయం తేరుకోకముందే ఐసీసీ అందరికీ షాక్ ఇచ్చింది. ఏం జరుగుతోందో అర్ధమయ్యలోపే ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించింది. క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త చరిత్రగా విశ్లేషకులు భావిస్తుండగా, సోషల్ మీడియాలో పలు సందేహాలు, న్యూజిలాండ్‌పై తీవ్ర సానుభూతి వ్యక్తమైంది. నైతికంగా న్యూజిలాండ్‌దే గెలుపు అని కొందరు వ్యాఖ్యానిస్తే.. ఏ రన్ అవుట్‌తో అయితే ధోనిని పెవిలియన్‌కు పంపారో.. న్యూజిలాండ్ కూడా అదే రనౌట్‌తో రన్నరప్‌గా నిలిచిందని మరికొందరు కమెంట్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు వెన్నెల కిషోర్ షేర్ చేసిన వీడియో వైరలవుతోంది. రెండుసార్లు టై అయిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజేత ఎలా అయిందో తెలుపుతూ వెన్నెల కిశోర్, బాలాజీ కలిపి ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నితిన్ హీరోగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో పరిమళగా నటిస్తున్న వెన్నెల కిషోర్ షూటింగ్ బ్రేక్‌లో ఈ వీడియోను తీసినట్టు ట్వీట్ చేశారు. In the mean time #Bheeshma Night shoot on hold for a moment.. pic.twitter.com/hrhvhRf6PP — vennela kishore (@vennelakishore) July 14, 2019 కాగా ఆదివారం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసి అల్ ఔట్ అయింది. అయినా కూడా ఆఖరి బంతికి ఒక పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్ణయం తీసుకోగా ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేత అంటూ ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుని విజేతగా ప్రకటిస్తారు. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ జట్టు రెండు బౌండరీలు కొట్టింది. కానీ, న్యూజిలాండ్ కేవలం ఒక సిక్స్ (సూపర్ ఓవర్)మాత్రమే కొట్టింది. దీంతో బౌండరీల లెక్కన ఇంగ్లండ్ గెలిచినట్టు ప్రకటించారు. చదవండి :ప్రపంచ కల నెరవేరింది -
ఇంగ్లండ్‌పై కివీస్‌దే గెలుపు
వెల్లింగ్టన్: ముక్కోణపు టి20 టోర్నీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (46 బంతుల్లో 72; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పోరాటం 184 పరుగులకే పరిమితమైంది. అలెక్స్ హేల్స్ (24 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), మలాన్ (40 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి భాగస్వామ్యం అందించినా మిగతావారు విఫలమమయ్యారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (2/46), శాన్‌ట్నర్ (2/29), ఇష్ సోధి (2/29) రాణించారు. విలియమ్సన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. -
ఇంగ్లండ్ -న్యూజిలాండ్ తొలిటెస్టు