ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం వెల్లడించింది. ఇక యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభావం తర్వాత క్రిస్ సిల్వర్ వుడ్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా టెస్టు కెప్టెన్సీ నుంచి జో రూట్ కూడా తప్పుకున్నాడు. అతడి స్థానంలో బెన్ స్టోక్స్ సారథిగా ఎంపికయ్యాడు.
ఇక ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్ జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచే మెక్ కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక మెక్ కల్లమ్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్‌ని నియమించడం మాకు ఆనందంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం. మెక్ కల్లమ్ రాకతో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు.
చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి'
Comments
Please login to add a commentAdd a comment