వెల్లింగ్టన్: వయస్సనేది కేవలం ఓ నంబర్ మాత్రమేనని, దాన్ని అటతో ముడిపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టిన ఈ కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. జాతీయ జట్టుకు మరికొన్నేళ్లు అడగలిగే సత్తా తనలో ఉందని తేల్చి చెప్పాడు. 2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్న మాట వాస్తవమేనని, కానీ దానిపై పునారాలోచించుకొని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానని వెల్లడించాడు.
ఆటను ఆస్వాదించగలిగినన్ని రోజులు క్రికెట్ ఆడతానని, ప్రస్తుతానికి తన ఫామ్‌కు ఏమాత్రం ఢోకా లేదని, స్థాయికి తగ్గ ప్రతిభను కనబర్చలేని రోజు స్వచ్చందంగా తప్పుకుంటానని పేర్కొన్నాడు. నేటి తరం ఆటగాళ్లు రిటైర్మెంట్‌పై లెక్కలేసుకోవడం మానుకోవాలని, వారిలో సత్తా ఉన్నన్ని రోజులు జట్టుకు సేవలందించడంపై దృష్టి సారించాలని సూచించాడు.
న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం కేన్ విలియమ్సన్ సారధ్యంలో అద్భుతంగా రాణిస్తుందని.. యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమాతూకంగా ఉందని అభిప్రాయడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ ఓ పీడకలగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ తరఫున టెస్ట్, వన్డే ఫార్మట్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన ఈ వెల్లింగ్టన్ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఈ పర్యటనలో కివీస్.. రెండు టెస్ట్‌లు ఆడనుంది. అనంతరం భారత్‌తో డబ్యూటీసీ ఫైనల్ పోరులో తలపడనుంది.
చదవండి: ఇంగ్లండ్ పర్యటనలో అతను పాంటింగ్‌ను అధిగమిస్తాడు..
Comments
Please login to add a commentAdd a comment