
Colin de Grandhomme ruled out of England tour: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమి నుంచి కోలుకోక ముందే న్యూజిలాండ్‌కు మరో ఎదరు దెబ్బ తగిలింది. గాయం కారణంగా కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గ్రాండ్‌హోమ్ తన కుడి కాలి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి 10 నుంచి 12 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు.
అయితే సిరీస్ ఆరంభానికి ముందే గ్రాండ్‌హోమ్‌కు బ్యాకప్‌గా హెన్రీ నికోల్స్‌ను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. కాగా నికోల్స్ ఇంగ్లండ్‌కు చేరుకున్న తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో గ్రాండ్‌హోమ్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్ తుది జట్టులోకి రానున్నాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం(జూన్14) ప్రారంభం కానుంది. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది.
చదవండి: Lionel Messi : మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’.. అర్జెంటీనా ఘనవిజయం