Colin de Grandhomme
-
సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న మరో న్యూజిలాండ్ ఆటగాడు! ఇకపై
New Zealand Cricket- Martin Guptill: గతంలో.. స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోం.. తాజాగా స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్.. న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు. గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బుధవారం ప్రకటన చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 జట్టుకు గప్టిల్ ఎంపికైనప్పటికీ ఆస్ట్రేలియా గడ్డ మీద ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20 ఫార్మాట్లో మెరుగైన రికార్డు ఉన్న గప్టిల్‌ను కాదని ఫిన్ అలెన్‌ను ఓపెనర్‌గా ఆడించింది యాజమాన్యం. ఇక ఈ టోర్నీలో కివీస్ సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గప్టిల్.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. చర్చించిన తర్వాతే ఈ నేపథ్యంలో అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ బోర్డు ఈ స్టార్ బ్యాటర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అనేక చర్చల అనంతరం గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. గప్టిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నా.. జాతీయ జట్టు సెలక్షన్ సమయంలో అతడి పేరును పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఎన్‌జెడ్‌సీ స్పష్టం చేస్తోంది. దేశవాళీ క్రికెట్ జట్టు ఎంపిక సమయంలోనూ అతడికి ప్రాధాన్యం ఉంటుంది’’ అని తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ విషయంపై స్పందించిన 36 ఏళ్ల గప్టిల్.. ‘‘దేశం తరఫున ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. బ్లాక్‌క్యాప్స్‌కు ఆడే సమయంలో నాకు సహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నా అవసరాల మేరకు ఇతర ఆప్షన్లు చూసుకోవాల్సి ఉంది. ఇతర అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అద్భుత రికార్డులు అలాగే కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికీ నేను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్ తరఫున టీ20లలో 122 మ్యాచ్‌లు ఆడి 3531 పరుగులు చేశాడు గప్టిల్. ఈ ఫార్మాట్లో న్యూజిలాండ్ టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. గుడ్ బై చెప్పినట్లే! అదే విధంగా 47 టెస్టుల్లో 2586, 198 వన్డేల్లో 7346 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 18 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్న ఈ స్టార్ బ్యాటర్.. టీ20లలో రెండె సెంచరీలు, 20 అర్ధ శతకాలు సాధించాడు. కాగా న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకునే వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో గప్టిల్ అనధికారికంగా ఎన్జెడ్సీకి గుడ్‌బై చెప్పినట్లే! చదవండి: Cristiano Ronaldo: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను! -
అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జింబాబ్వేలో పుట్టి పెరిగిన 36 ఏళ్ల గ్రాండ్‌హోమ్ 2004 వరకు జింబాబ్వే తరపున క్రికెట్ ఆడాడు. 2004లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ గ్రాండ్‌హోమ్ జింబాబ్వే తరపునే పాల్గొన్నాడు. ఆ తర్వాత 2006లో కుటుంబంతో కలిసి ఆక్లాండ్‌కు వలస వచ్చిన గ్రాండ్‌హోమ్ 2012లో న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దాదాపు దశాబ్దం పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్రాండ్‌హోమ్ మంచి ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించాడు. 29 టెస్టుల్లో 1432 పరుగులు.. 49 వికెట్లు, 45 వన్డేల్లో 742 పరుగులు.. 30 వికెట్లు, 41 టి20ల్లో 505 పరుగులు.. 12 వికెట్లు తీశాడు. గ్రాండ్‌హోమ్ ఖాతాలో టెస్టుల్లో రెండు సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉండగా.. వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలు అందుకున్నాడు. కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సభ్యుడు. ఇక 2019లో వన్డే ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన కివీస్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇక తన రిటైర్మెంట్పై గ్రాండ్‌హోమ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ''రిటైర్మెంట్ నిర్ణయం బాధిస్తున్నప్పటికి తప్పడం లేదు. గాయాల కారణంగా సరైన క్రికెట్ ఆడలేకపోతున్నానే ఫీలింగ్ కలుగుతుంది. ఫామ్‌లో లేను.. ఇలాంటి సమయంలో నేను రిటైర్ అయితే కనీసం కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. 2012లో కివీస్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బ్లాక్‌క్యాప్స్‌కు ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. ఇన్నేళ్ల అంతర్జాతీయ కెరీర్ సాఫీగా సాగినందుకు గర్వపడుతున్నా. నా ఆట ముగింపుకు ఇదే సరైన సమయమని.. అందుకే ఈ నిర్ణయం'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లోనూ 2017 నుంచి 2019 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్‌కు ఆడిన గ్రాండ్‌హోమ్ 25 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు. చదవండి: AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్ -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
Colin de Grandhomme ruled out of England tour: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమి నుంచి కోలుకోక ముందే న్యూజిలాండ్‌కు మరో ఎదరు దెబ్బ తగిలింది. గాయం కారణంగా కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గ్రాండ్‌హోమ్ తన కుడి కాలి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి 10 నుంచి 12 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే సిరీస్ ఆరంభానికి ముందే గ్రాండ్‌హోమ్‌కు బ్యాకప్‌గా హెన్రీ నికోల్స్‌ను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. కాగా నికోల్స్ ఇంగ్లండ్‌కు చేరుకున్న తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో గ్రాండ్‌హోమ్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్ తుది జట్టులోకి రానున్నాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం(జూన్14) ప్రారంభం కానుంది. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. చదవండి: Lionel Messi : మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’.. అర్జెంటీనా ఘనవిజయం