Number 11 Batsman Seals Semifinal Win Six Last Ball Against Hat Trick Hero - Sakshi
Sakshi News home page

సిక్స్‌ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్‌; ఆఖరి బంతికి ట్విస్ట్‌

Published Tue, Feb 1 2022 2:31 PM | Last Updated on Tue, Feb 1 2022 6:07 PM

Number 11 Batsman Seals Semifinal Win Six Last Ball Against Hattrick Hero - Sakshi

ఆ జట్టుకు చేతిలో ఆఖరి వికెట్‌.. సిక్స్‌ కొడితే నేరుగా ఫైనల్లోకి.. అవతలేమో హ్యాట్రిక్‌తో సూపర్‌ ఫామ్‌లో ఉన్న బౌలర్‌.. ఇక్కడ చూస్తే ఒక టెయిలెండర్‌ బ్యాట్స్‌మన్‌.. అంత ఫామ్‌లో ఉ‍న్న బౌలర్‌ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇంకేం గెలుస్తారులే అని మనం అనుకునేలోపూ అసాధ్యం సుసాధ్యమైంది. జట్టులోని 11వ బ్యాట్స్‌మన్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి సగర్వంగా ఫైనల్‌కు చేర్చాడు. ఆద్యంతం ఉ‍త్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ కింగ్స్‌గ్రూవ్‌ స్పోర్ట్స్‌ టి20 కప్‌లో చోటుచేసుకుంది. 

చదవండి: WI vs SA: సూపర్ ఓవ‌ర్‌లో వెస్టిండీస్ వీర బాదుడు.. 3సిక్స్‌లు, 2ఫోర్లతో

విషయంలోకి వెళితే.. న్యూసౌత్‌ వేల్స్‌ వేదికగా  మోస్‌మన్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో యునివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్‌వేల్స్‌ క్రికెట్‌ క్లబ్‌ 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆఖరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి ఉంది. న్యూ సౌత్‌వేల్స్‌ కచ్చితంగా గెలుస్తుందని అంతా భావించారు.. కానీ హైడ్రామా నెలకొంది. ఆ ఓవర్‌ వేసిన జేక్‌ టర్నర్‌ తొలి బంతికి పరుగులివ్వలేదు. ఇక వరుసగా రెండు, మూడు, నాలుగు బంతుల్లో వరుసగా వికెట్లు తీసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇక రెండు బంతుల్లో విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి డెక్లన్‌ సింగిల్‌ తీసి మెక్‌లీన్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు.

మెక్‌లీన్‌ అప్పుడే వచ్చిన 11వ బ్యాట్స్‌మన్‌.. ఆఖరి బంతికి సిక్స్‌ కొడితేనే జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఉత్కంఠగా మారిన వేళ  టర్నర్‌ ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీని వేశాడు. అంతే బంతి మంచి టైమింగ్‌తో రావడంతో మెక్‌లీన్‌ లెగ్‌సైడ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. కట్‌చేస్తే.. సిక్స్‌ పడింది.. ఇంకేముంది బ్యాటింగ్‌ సైడ్‌ టీమ్‌లో సంబరాలు షురూ అయ్యాయి. ఎవరు ఊహించని రీతిలో న్యూసౌత్‌వేల్స్‌ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. ఒకే ఒక్క సిక్స్‌తో మెక్‌లీన్‌ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: టీమిండియాపై విజ‌యం మాదే.. విండీస్ ప‌వ‌ర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement