
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ వెళ్లింది. 266 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్లు దాటికి 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. దీప్తీ శర్మ రెండు, పూజా, రేణుకా సింగ్, తలా వికెట్ పడగొట్టారు.













































