india women
-
INDW Vs SAW Photos: దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
World Blitz Chess: హంపి అద్భుతం
అల్మాటీ (కజకిస్తాన్): ఊహకందని ఆటతీరుతో అదరగొట్టిన భారత మహిళా చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. నిర్ణీత 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి రోజు గురువారం తొమ్మిది రౌండ్లు ముగిశాక హంపి 5 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉండటంతో ఆమెకు పతకం నెగ్గే అవకాశాలు లేవని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హంపి రెండో రోజు జరిగిన ఎనిమిది గేముల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు గేముల్లో గెలవడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 44వ స్థానం నుంచి ఏకంగా రెండో ర్యాంక్‌కు చేరుకుంది. 13 పాయింట్లతో బిబిసారా అసుబయేవా (కజకిస్తాన్) విజేతగా నిలువగా... 12 పాయింట్లతో పొలీనా షువలోవా (రష్యా) కాంస్య పతకాన్ని సాధించింది. బిబిసారాకు 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), హంపికి 30 వేల డాలర్లు (రూ. 24 లక్షల 83 వేలు), పొలీనాకు 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 10.5 పాయింట్లతో హారిక 13వ ర్యాంక్‌లో నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 16 పాయింట్లు) టైటిల్ సాధించగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 13 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 12 పాయింట్లతో 42వ ర్యాంక్‌లో నిలిచారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో హంపి సాధించిన మొత్తం పతకాలు. ర్యాపిడ్ విభాగంలో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకం గెలిచింది. బ్లిట్జ్ విభాగంలో రజతం రూపంలో తొలిసారి పతకం సాధించింది. -
ఫైనల్లో పాక్‌పై భారత్ విజయం
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో పాకిస్తాన్‌పై భారత్ 17 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని సాధించింది. భారత్ విసిరిన 122 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పోరాడి ఓడింది. పాక్ క్రీడాకారిణుల్లో అయేషా జాఫర్(15),జావిరియా ఖాన్(22), బిస్మా మరూఫ్(25) ఫర్వాలేదనిపించినా, మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. దాదాపు పది ఓవర్ల వరకూ మ్యాచ్ పాక్ వైపు మొగ్గగా, చివరి ఓవర్లలో భారత్ పైచేయి సాధించి గెలుపును సొంతం చేసుకుంది. చివరి రెండు ఓవర్లలో పాకిస్తాన్ 32 పరుగులు చేయాల్సి రావడంతో అది వారికి కష్ట సాధ్యంగా మారింది. పాకిస్తాన్ 20.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 104 పరుగులే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించగా,అనూజా పటేల్,జులాన్ గోస్వామి, శిఖా పాండే,ప్రీతి బోస్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. భారత ఓపెనర్ మిథాలీ రాజ్ ( 73 నాటౌట్;65 బంతుల్లో 7 ఫోర్లు1 సిక్స్) ఒంటరి పోరాటం చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలు పంచుకుంది. మరోవైపు మిథాలికీ జులాన్ గోస్వామి(17) కొద్దిపాటి సహకారం అందించి జట్టును కాపాడింది. భారత మిగతా క్రీడాకారిణుల్లోమందనా(6),మేఘనా(9), వేదా కృష్ణమూర్తి(2), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5)లు ఘోరంగా విఫలమయ్యారు. 'ఆరే'సిన భారత్ ఇప్పటివరకే ఆరు ఆసియాకప్ మహిళా టోర్నీలు జరగ్గా ఆరింటిలో భారత్ విజేతగా నిలవడం విశేషం. 2004లో మహిళల వన్డే ఆసియాకప్ ఆరంభమైంది. అప్పట్నుంచి 2008 వరకూ నాలుగు వన్డే ఆసియాకప్‌లు జరగ్గా, ఆ తరువాత రెండు టీ 20 ఆసియాకప్‌లు జరిగాయి. చివరిసారి 2012లో జరిగిన మహిళల ఆసియాకప్ టీ 20 ఫైనల్లో పాక్‌పై భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేళ్ల తరువాత అదే ఫలితాన్ని భారత్ పునరావృతం చేసింది. -
కట్టుబాట్లు - సవాళ్లు
-
ఒలింపిక్స్ బెర్తు ఆశలు పదిలం
బెల్జియం: వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి భారత మహిళల హాకీ జట్టు ఆశల్ని పదిలంగా ఉంచుకుంది. ప్రపంచ హాకీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-0తో జపాన్‌పై విజయం సాధించింది. భారత క్రీడాకారిణి సవిత ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్నందించింది. ఈ ఈవెంట్లో భారత్ ఐదోస్థానంలో నిలిచింది.