South Africa Women
-
ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్, టాంజిబ్ బ్రిట్స్ ఊదిపడేశారు.వోల్వార్ట్ 55 బంతుల్లో 59 పరుగులు చేయగా.. బ్రిట్స్ 52 బంతుల్లో 57 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో ఎనిమిది బౌలింగ్ చేసినప్పటకి ఏ ఒక్కరూ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. ప్రోటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 118 పరుగులకే పరిమితమైంది.సౌతాఫ్రికా స్పిన్నర్ మల్బా 4 వికెట్లతో చెలరేగింది. ఆమెతో పాటు కాప్ రెండు వికెట్లు సాధించింది. విండీస్ బ్యాటర్లలో టేలర్(44 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక దక్షిణాఫ్రికా తమ తర్వాతి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఇంగ్లండ్‌తో తలపడనుంది. అదే విధంగా విండీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 6న స్కాట్లాండ్ను ఢీకొట్టనుంది.చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది
లాగోస్: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్లైన్లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. నైజీరియా తండ్రి, మొజాంబిక్ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. -
INDW Vs SAW Photos: దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
T20 Tri Series: టీమిండియా ఘన విజయం.. విండీస్‌కు చేదు అనుభవం
T20I Tri-Series - India Women vs West Indies Women: సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ మైదానంలో వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ట్రై సిరీస్ మూడో మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి జట్టును 56 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. దంచికొట్టిన మంధాన విండీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా(18 పరుగులు) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది. 51 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్మన్ డియోల్(12) విఫలం కాగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయ అర్ద శతకం(35 బంతుల్లో 56 పరుగులు)తో మెరిసింది. మంధాన మెరుపులకు తోడు హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దెబ్బకొట్టిన దీప్తి శర్మ టీమిండియా బౌలర్ దీప్తి శర్మ.. విండీస్ ఓపెనర్లు రషద విలియమ్స్(8), బ్రిట్నీ కూపర్(0)లను ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన షిమేనే కాంప్బెల్లె 47 పరుగులతో రాణించగా.. రాధా యాదవ్ ఆమెకు చెక్ పెట్టింది. ఇతర బ్యాటర్లలో కెప్టెన్ హేలీ మాథ్యూస్(34- నాటౌట్) ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయిన వెస్టిండీస్ 111 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ముందంజలో టీమిండియా అంతకు ముందు.. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించిన భారత మహిళా జట్టు.. విండీస్‌ను సైతం ఓడించి సిరీస్‌లో ముందంజలో నిలిచింది. ఇక సౌతాఫ్రికా.. గత మ్యాచ్‌లో విండీస్‌పై 44 పరుగుల తేడాతో గెలుపొందింది. విండీస్‌కు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమే ఎదురైంది. చదవండి: Ravindra Jadeja: జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్‌లో కెప్టెన్‌గా.. ఆసీస్‌తో మ్యాచ్ కోసం.. Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? -
టెస్టుల్లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్.. 61 ఏళ్ల రికార్డు బద్దలు..!
ఇంగ్లండ్ మహిళలతో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యా్చ్ తొలి ఇన్నింగ్స్‌లో కాప్ అద్భుతమైన సెంచరీ సాధించింది. కాగా కాప్‌కు తన టెస్టు కెరీర్లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఇక 213 బంతుల్లో 150 పరుగులు చేసిన కాప్.. తమ జట్టు 284 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధిండంలో కీలక పాత్ర పోషించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 45 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కాప్ జట్టును అదుకుంది. ఒక వైపు వికెట్లు పడుతున్నా కాప్ ఒంటిరి పోరాటం చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్ నాలుగు వికెట్లు,బెల్ రెండు,ఇసాబెల్లె వాంగ్,సోఫీ ఎక్లెస్టోన్,డేవిడ్సన్ రిచర్డ్స్,నటాలీ స్కివర్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో కాప్ సాధించిన రికార్డులు ►150 పరుగులు చేసిన కాప్.. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ►అంతకుముందు 1961లో వైవోన్ వాన్ మెంట్జ్ ఇంగ్లండ్‌పై 105 పరుగులు సాధించింది. ►మహిళల టెస్టుల్లో ఆరు లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన తొలి క్రికెటర్‌గా కాప్ నిలిచింది. ►మహిళల టెస్టుల్లో అత్యధిక వేగంగా 150 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కాప్ రికార్డులకెక్కింది. ► కాప్ 212 బంతుల్లో ఈ ఘనత సాధించగా. అంతకుముందు ఆస్ట్రేలియా క్రికెటర్ కరాన్ రోల్టాన్ 213 బంతుల్లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ►మహిళల టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన జాబితాలో కాప్(150) ఐదో స్థానంలో నిలిచింది. ► ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ గోజ్కో 204 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతుంది. చదవండి: Ind Vs IRE Predicted Playing XI: రాహుల్ త్రిపాఠికి ఛాన్స్.. అర్ష్‌దీప్ ఎంట్రీ! Is Marizanne Kapp the best player in the world right now? Answer is yes. https://t.co/A8uxpoxlDL — Frances Mackay (@FrankieMac71) June 27, 2022 Marizanne Kapp single-handedly took on the English attack in a scintillating display of counterattacking test cricket and has broken a 59-year-old record by setting the highest test score by a South African Woman. Simply out of this world Photos @GettyImages @OfficialCSA pic.twitter.com/Frfuh1nqtk — RayderMedia (@rayder_media) June 28, 2022 Record-breaker Marizanne Kapp sums up Day 1 as the #MomentumProteas get ready for Day 2 🔊 📺 SuperSport Grandstand 201 #ENGvSA #AlwaysRising #BePartOfIt pic.twitter.com/0e4THeOSPq — Cricket South Africa (@OfficialCSA) June 28, 2022 -
కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు.. చేదు అనుభవమే మిగిల్చింది
వెస్టిండీస్ వుమెన్ ప్లేయర్ డియాండ్రా డాటిన్ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును సాధించింది. సౌతాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. అలా తన కెరీర్ బెస్ట్ నమోదు చేసిన డియాండ్రాకు మ్యాచ్‌లో చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఆమె సెంచరీ చేసిన మ్యాచ్‌లో జట్టు ఓడిపోయిందనుకుంటే పొరపాటే.. వరుణుడి రూపంలో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం రాలేదు. చదవండి: U19 World Cup 2022: మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ జట్టు 46వ ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అందులో సగానికి పైగా స్కోరు డియాండ్రాదే. 159 బంతుల్లో 18 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 150 పరుగుల కెరీర్ బెస్ట్‌ను నమోదు చేసింది. అంతకముందు పాకిస్తాన్‌పై 132 పరుగులు ఆమెకు వన్డేల్లో అత్యధిక స్కోరుగా ఉండేది. అయితే వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 46 ఓవర్లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో దక్షిణాఫ్రికా లక్ష్యం 29 ఓవర్లలో 204 పరుగుల టార్గెట్‌ను విధించారు. అయితే 18 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో మరోసారి వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అయితే వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి ఆట సాధ్యం కాదని తేల్చి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలా వర్షం రూపంలో డియాండ్రాను దురదృష్టం వెంటాడింది. తాను భారీ స్కోరు చేసిన మ్యాచ్ ఇలా వర్షార్పణం అవడం ఊహించలేదని.. చాలా బాధగా ఉందని డియాండ్రా ఇంటర్య్వూలో పేర్కొంది. చదవండి: మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు -
తొలి టి20లో భారత్ ఘన విజయం
పోట్చెఫ్స్ట్రూమ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టి20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య టీమ్‌ను 7 వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మిథాలీరాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించింది. 48 బంతుల్లో 6 ఫోర్లు సిక్సర్‌తో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. రోడ్రిక్స్(37), వేద కృష్ణమూర్తి(37) రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. వాన్ నీకెర్క్ 38, ట్రియన్ 32, డు ప్రీజ్ 31 రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్ 2 వికెట్లు తీసింది. శిఖా పాండే, వస్త్రకార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
చివరి బంతికి రనౌట్.. మ్యాచ్ టై
-
చివరి బంతికి రనౌట్.. మ్యాచ్ టై
కాఫ్స్ హార్బర్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే అభిమానులకు అసలైన క్రికెట్ మజా అందించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. 243 పరుగుల లక్ష్యంతో దిగిన సౌతాఫ్రికా విజయానికి దాదాపుగా చేరువైంది. 49.5 ఓవర్లలో జట్టు స్కోరు 242/9. చేతిలో మరో వికెట్ ఉండగా, చివరి బంతికి మరో రన్ చేస్తే విజయం వరిస్తుంది. విలాని వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతిని ఆడిన క్లాస్ సింగిల్ తీసేందుకు వెళ్లింది. మూనీ.. క్లాస్‌ను రనౌట్ చేయడంతో సౌతాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కూడా 49.5 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా కావడంతో మ్యాచ్ టై అయ్యింది. ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్ ఇప్పటికే 3-0తో సొంతం చేసుకోగా, సౌతాఫ్రికా ఇంకా బోణీ కొట్టలేదు. ఆస్ట్రేలియా జట్టులో బోల్టన్ (63), పెరీ (69) హాఫ్ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లూస్ నాలుగు, వాన్ నీకెర్క్ మూడు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో వాన్ నీకెర్క్ (81), కాప్ (66) అర్ధశతకాలు బాదారు. ఆస్ట్రేలియా బౌలర్ జొనాసెన్ మూడు వికెట్లు తీసింది. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వాన్ నీకెర్క్ ఆల్ రౌండ్ షోతో రాణించినా ఫలితం లేకపోయింది.