తొలి టి20లో భారత్‌ ఘన విజయం | India Women beats South Africa in First T20 | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 13 2018 7:20 PM | Last Updated on Tue, Feb 13 2018 7:21 PM

India Women beats South Africa in First T20 - Sakshi

మిథాలీరాజ్‌

పోట్చెఫ్‌స్ట్రూమ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టి20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య టీమ్‌ను 7 వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మిథాలీరాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించింది. 48 బంతుల్లో 6 ఫోర్లు సిక్సర్‌తో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. రోడ్రిక్స్‌(37), వేద కృష్ణమూర్తి(37) రాణించారు.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. వాన్‌ నీకెర్క్‌ 38, ట్రియన్‌ 32, డు ప్రీజ్‌ 31 రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్‌ 2 వికెట్లు తీసింది. శిఖా పాండే, వస్త్రకార్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement