
ఆదివారం ‘హిట్‌మ్యాన్’ విరుచుకుపడ్డాడు. నోటితో కాదు... బ్యాట్‌తో! నెట్‌లో కాదు... మైదానంలో! అద్భుతమైన సెంచరీతో కొండంత లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించేలా చేశాడు. దీంతో ఆఖరి పోరు మిగిలుండగానే వన్డే సిరీస్ కూడా భారత్ చేతికి చిక్కింది

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది

బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు

కఠినమైన లక్ష్యమే అయినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ రోహిత్ (90 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) వీరోచిత శతకంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది.

ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. చివరిదైన మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది

































