
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో చేధించింది. భారత యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.

ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను గిల్ ఫినిష్ చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది

బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు.

భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు.


























