భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలనుకున్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన కల ఎట్టకేలకు నేరవేరింది. సోమవారం సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో ఆశా శోభనా టీమిండియా తరపున అరంగేట్రం చేసింది.
భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా ఆశా శోభన 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆశా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎవరీ ఆశా శోభన?
ఆశా శోభన దేశీవాళీ క్రికెట్‌లో కేరళ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను ఆదర్శంగా తీసుకుని ఆశా శోభన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 13 ఏళ్ల వయస్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది.
ఆ తర్వాత కేరళ జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో ఆమెకు చోటు దక్కింది. కానీ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకలేకపోయింది. అయితే డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్‌లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ఆమెను సొంతం చేసుకుంది.
తొలి సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆశా.. డబ్ల్యూపీఎల్-2024 సీజన్‌లో మాత్రం దుమ్ములేపింది. 10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఈ క్రమంలో భారత సెలక్టర్లు నుంచి ఆశాకు పిలుపు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment