kerala cricket
-
Ranji Trophy: కేరళ కెప్టెన్ సంజూ కాదు!.. కారణం ఇదే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ రంజీ బరిలో దిగనున్నాడు. సొంత రాష్ట్రం కేరళ తరఫున రెడ్‌బాల్ టోర్నీలో పాల్గొననున్నాడు. అయితే, ఈసారి కెప్టెన్‌గా గాకుండా కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గానే ఆడనున్నాడు. ఇందుకు కారణం ఏమిటంటే..?టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఉందని సంజూ శాంసన్ ఇటీవల తన మనసులోని మాట వెల్లడించిన విషయం తెలిసిందే. మేనేజ్మెంట్ సైతం ఇందుకు సుముఖంగా ఉందని పరోక్షంగా తెలిపాడు. యాజమాన్యం సూచనల మేరకే తాను దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగానన్నాడు సంజూ.ఇక ఆ టోర్నీలో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్న సంజూ శాంసన్.. తదుపరి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాతో చేరాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్ మూడో మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి టీమిండియా 3-0తో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.కారణం ఇదేఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. తాను త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఇందుకు రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో అతడు రాణించాల్సి ఉంది. అయితే, గత ఎడిషన్‌లో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ ఈసారి.. సారథ్య బాధ్యతలకు దూరమయ్యాడు. టీమిండియా నవంబరులో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుండటమే ఇందుకు కారణం.రంజీ తాజా ఎడిషన్‌లో సచిన్ బేబీ సారథ్యంలో కేరళ తొలుత పంజాబ్‌తో మ్యాచ్ ఆడి.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తదుపరి శుక్రవారం నుంచి కర్ణాటకతో తలపడేందుకు సిద్ధం కాగా.. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్ కారణంగా సంజూ కొన్ని రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.ముఖ్యంగా ఉత్తరప్రదేశ్(నవంబరు 6-9), హర్యానా(నవంబరు 13- 16)తో కేరళ ఆడే మ్యాచ్‌లకు సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయంలో (నవంబరు 8 నుంచి) టీమిండియా టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లనుంది. అందుకే సంజూ కేరళ జట్టు కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND Vs NZ 1st Test: పాపం రోహిత్ శర్మ!.. ఆనందం ఆవిరి.. అన్‌లక్కీ భయ్యా! -
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన కల ఎట్టకేలకు నేరవేరింది. సోమవారం సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో ఆశా శోభనా టీమిండియా తరపున అరంగేట్రం చేసింది. భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా ఆశా శోభన 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆశా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ ఆశా శోభన?ఆశా శోభన దేశీవాళీ క్రికెట్లో కేరళ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను ఆదర్శంగా తీసుకుని ఆశా శోభన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 13 ఏళ్ల వయస్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత కేరళ జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో ఆమెకు చోటు దక్కింది. కానీ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకలేకపోయింది. అయితే డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ఆమెను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆశా.. డబ్ల్యూపీఎల్-2024 సీజన్లో మాత్రం దుమ్ములేపింది. 10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఈ క్రమంలో భారత సెలక్టర్లు నుంచి ఆశాకు పిలుపు వచ్చింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్
Sreesanth Announces Retirement: టీమిండియా వివాదాస్పద బౌలర్, కేరళ క్రికెటర్ శాంతకుమరన్ నాయర్ శ్రీశాంత్ (39) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని, ఆ స్థాయికి చేరేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు, జట్టు సహచరులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని చాలా బాధతో, బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నానని తెలిపాడు. యువతరానికి అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించాడు. It has been an honor to represent my family, my teammates and the people of India. Nd everyone who loves the game . With much sadness but without regret, I say this with a heavy heart: I am retiring from the Indian domestic (first class and all formats )cricket , — Sreesanth (@sreesanth36) March 9, 2022 For the next generation of cricketers..I have chosen to end my first class cricket career. This decision is mine alone, and although I know this will not bring me happiness, it is the right and honorable action to take at this time in my life. I ve cherished every moment .❤️🏏🇮🇳 — Sreesanth (@sreesanth36) March 9, 2022 క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సరైన సమయమిదేనని అభిప్రాయపడ్డాడు. బాగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరఫున 27 టెస్ట్‌లు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్ మొత్తం 169 వికెట్లు(87 టెస్ట్ వికెట్లు, 75 వన్డే, 7 టీ20 వికెట్లు) పడగొట్టాడు. ఈ వెటరన్ పేసర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఏ జట్టు అతనిపై ఆసక్తి కనబర్చకపోవడంతో అమ్ముడుపోని క్రికెటర్ల జాబితాలో మిగిలిపోయాడు. శ్రీశాంత్ 50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో మెగా వేలంలో పేరును నమోదు చేసుకున్నాడు. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీశాంత్...! -
నాలుగో రోజూ ఆట రద్దు
కొచ్చి: సౌత్, నార్త్ జోన్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వర్షం వెంటాడుతూనే ఉంది. నాలుగో రోజు ఆట కూడా రద్దయ్యింది. భారీ వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఆదివారం ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. ఉదయం మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు సంజయ్ హజారే, సురేశ్ శాస్త్రిలు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రిజర్వ్ డే (మంగళవారం)ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీంతో 15 నిమిషాలు ముందుగా మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి, మూడో రోజు ఆట కూడా రద్దు కావడంతో మొత్తం 350 ఓవర్ల మ్యాచ్ నష్టపోయింది. మరోవైపు వరుసగా ఆట రద్దు కావడంపై కేంద్ర మంత్రి శశి థరూర్.. కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ)పై ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ప్రతిష్టకు కేసీఏ మచ్చ తెస్తోంది. రెండు మేజర్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. డ్రైనేజి సిస్టమ్ కోసం ఖర్చు చేసిన రూ. 8 కోట్లు ఎవరికి లబ్ధి చేకూర్చాయి. జేఎన్ఐ స్టేడియం, డ్రైనేజీ అధునీకరణ కోసం కోట్లు ఖర్చు చేశామని వార్షిక నివేదికలో పొందుపర్చారు. పెవిలియన్ పనులు చేసినప్పుడు అందులో డ్రైనేజీ ముఖ్యం కాదా? ఈ విషయాన్ని అభిమానులు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని థరూర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.