
మెల్‌బోర్న్: పొట్టి ప్రపంచకప్‌కు ముందు ముక్కోణపు టైటిల్ పట్టాలని భారత్, ఆస్ట్రేలియా మహిళలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇరు జట్ల మధ్య బుధవారం టి20 ఫైనల్ పోరు జరుగనుంది. ఇంగ్లండ్ కూడా పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌ల తర్వాత మూడు జట్లూ నాలుగేసి పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో మెరుగైన రన్‌రేట్‌తో భారత్, ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఆసీస్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ధాటిగా ఆడటంతో కొండంత లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. బౌలింగ్‌లో దీప్తి, రాజేశ్వరి గైక్వాడ్, రాధ యాదవ్‌లు కూడా తమ స్థాయి మేరకు రాణిస్తే ఆసీస్‌ను మళ్లీ కంగుతినిపించి కప్ కొట్టడం భారత్‌కు కష్టమేమీ కాదు.
Comments
Please login to add a commentAdd a comment