triangular series
-
9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ముక్కోణపు సిరీస్‌లో యువ భారత జట్టు విజయపరంపర కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించిన భారత్.. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత అండర్ 19 జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నమన్ తివారీ (7-1-11-4), ప్రియాన్షు మోలియా (5-0-15-2), ఆరాధ్య శుక్లా (6-1-20-2), ధనుశ్ గౌడ (8-2-23-2) ధాటికి 33 ఓవర్లలో 88 పరుగులకే చాపచుట్టేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లు కాగా.. నసీర్ హస్సన్ (31), సోహిల్ ఖాన్ (21), రహీముల్లా జుర్మతై (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆదర్శ్ సింగ్ (52 నాటౌట్) అర్దసెంచరీతో రాణించడంతో కేవలం 12.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. మహాజన్ 12 పరుగులకు ఔట్ కాగా.. ముషీర్ ఖాన్ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. అల్లా ఘజన్ఫర్కు మహాజన్ వికెట్ దక్కింది. ఈ సిరీస్‌లో జనవరి 6న జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో భారత్.. సౌతాఫ్రికాతో తలపడనుంది. 8వ తేదీన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్, జనవరి 10న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ముక్కోణపు సిరీస్‌లో యువ భారత జట్టు.. సౌతాఫ్రికా అండర్ 19 జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టోర్నీలో భాగంగా నిన్న (జనవరి 2) జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఆరాధ్య శుక్లా (4/43), సౌమీ పాండే (3/49), అర్షిన్ కులకర్ణి (2/53) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ప్రిటోరియస్ (67), స్టీవ్ స్టాల్క్ (46), మోకోయినా (28 నాటౌట్) మాత్రమే రాణంచగా.. మిగతావారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆదర్శ్ సింగ్ (66), అర్షిన్ కులకర్ణి (91), అరవెల్లి అవినాశ్ (60 నాటౌట్) రాణించడంతో మరో 55 బంతులు మిగిలుండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రొటీస్ బౌలర్లలో మోకోయినా 2, జుయాన్ జేమ్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ ముక్కోణపు టోర్నీలో భారత్, సౌతాఫ్రికాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ పాల్గొంటుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. టీమిండియా చేతిలో, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడింది. జనవరి 4న ఆఫ్ఘనిస్తాన్.. టీమిండియాతో తలపడుతుంది. అనంతరం 6న భారత్-సౌతాఫ్రికా, 8న సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్, జనవరి 10న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్
సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ముక్కోణపు టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆతిథ్య జట్టును 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టోర్నీలో భాగంగా ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 39 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 30.4 ఓవర్లలోనే 129 పరుగులకు చాపచుట్టేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్టిన్ ఖుమాలో (8-1-42-4), క్వేనా మపాకా (8-0-44-3), రిలే నార్టన్ (5-0-17-1), జుయాన్ జేమ్స్ (7-0-26-1), రొమాషన్ పిల్లే (6-1-20-1) రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహీముల్లా జుర్మతి (47), జంషిద్ జద్రాన్ (33), హస్సన్ ఎయిసఖిల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. ఆఫ్ఘన్ బౌలర్లు అల్లా ఘజన్ఫర్ (9-1-36-4), అరబ్ గుల్ మొమంద్ (5.4-0-13-4), బషీర్ అహ్మద్ (5-0-35-1), ఫరీదున్ దావూద్జాయ్ (5-0-23-1) ధాటికి 129 పరుగులకు కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రిటోరియస్ (51) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ టోర్నీలో తదుపరి మ్యాచ్‌లో భారత్-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. జనవరి 2న ఈ మ్యాచ్ జరుగనుంది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. -
IND vs SA Womens T20 Tri Series 2023: తుది పోరులో పేలవంగా...
ఈస్ట్ లండన్: టి20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా సాగిన టోర్నమెంట్లో భారత మహిళల జట్టుకు తీవ్ర నిరాశ! లీగ్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో చివరి మెట్టుపై చతికిలపడింది. ఫలితంగా ముక్కోణపు టోర్నీలో ఆతిథ్య దక్షిణాఫ్రికా మహిళలు విజేతగా నిలిచారు. గురువారం జరిగిన ఫైనల్లో సఫారీ బృందం 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగలిగింది. వికెట్లు అందుబాటులో ఉన్నా... సఫారీ టీమ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు భారత టాప్–4 బ్యాటర్లంతా వేగంగా ఆడటంలో విఫలమయ్యారు. ఎనిమిది బంతులాడి స్మృతి మంధాన (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (11) కూడా విఫలమైంది. హర్లీన్ డియోల్ (56 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిరాశపర్చింది. చివర్లో దీప్తి శర్మ (14 బంతుల్లో 16 నాటౌట్) స్కోరును 100 పరుగులు దాటించింది. ఎమ్లాబాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికా కూడా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రైఆన్ (32 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించి జట్టును గెలిపించింది. స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టింది. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది. ఈ నెల 10నుంచి దక్షిణాఫ్రికా గడ్డపైనే మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది. -
రాణించిన కాన్వే.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నీలో న్యూజిలాండ్ జట్టు బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 9) జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. బంగ్లాదేశ్‌ను 137 పరుగులకే కట్టడి చేసింది. కివీస్ బౌలర్లు బౌల్ట్ (2/25), సౌథీ (2/34), బ్రేస్‌వెల్ (2/14), సోధీ (2/31) మూకుమ్మడిగా విజృంభించడంతో బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ శాంటో (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఫీఫ్ హొసేన్ (24, నరుల్ హసన్ (25 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆఖర్లో నరుల్ వేగంగా (12 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) పరుగులు సాధించడంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాణించిన కాన్వే.. చెలరేగిన ఫిలిప్స్ బంగ్లాదేశ్ నిర్ధేశించిన 138 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (9 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగలు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (30) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్ తలో వికెట్ పడగొట్టారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టిన బ్రేస్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీలో తదుపరి మ్యాచ్ అక్టోబర్ 11న న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగనుంది. -
రెచ్చిపోయిన బాబర్.. పాక్ ఖాతాలో వరుసగా రెండో విక్టరీ
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో దాయాది పాకిస్తాన్ వరుస విజయాల బాట పట్టింది. నిన్న (అక్టోబర్ 7) బంగ్లాదేశ్‌ను 21 పరుగుల తేడా మట్టికరిపించిన బాబర్ సేన.. ఇవాళ ఆతిధ్య న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇవాల్టి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన పాక్ న్యూజిలాండ్‌ను 147 పరుగులకే (20 ఓవర్లలో 147/8) పరిమితం చేసింది. హరీస్ రౌఫ్ 3 వికెట్లతో కివీస్‌ను దెబ్బకొట్టగా.. మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్ తలో రెండు వికెట్లు, షానవాజ్ దహాని ఓ వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన డెవాన్ కాన్వే టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (31), మార్క్ చాప్మన్ (32) పర్వాలేదనిపించారు. అనంతరం 148 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (53 బంతుల్లో 79; 11 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో చెలరేగడంతో 18.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ ఇన్నింగ్స్‌లో షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ఆఖర్లో హైదర్ అలీ 2 బంతుల్లో సిక్స్, ఫోర్ బాది పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (4 ఓవర్లలో 1/22), టిమ్ సౌథీ (4 ఓవర్లలో 1/24) పొదుపుగా బౌలింగ్ చేయగా.. టిక్నర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ధసెంచరీతో రాణించిన పాక్ కెప్టెన్ బాబర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీలో రేపు (అక్టోబర్ 9) జరుగబోయే మ్యాచ్‌లో న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. -
ఆస్ట్రేలియా వేదికగా భారత్-పాక్ వన్డే సిరీస్..?
Australia To host India, Pakistan In Tri Series: చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య పోరుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా దాయాదులతో కలుపుకుని ముక్కోణపు సిరీస్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఏ చీఫ్ నిక్ హాక్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్‌లు చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ్డాయి. అయితే, ఆసీస్ క్రికెట్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలతో భారత, పాక్ క్రికెట్ అభిమానుల్లో ఈ అంశానికి సంబంధించిన చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇదే విషయాన్ని పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదించాడు. అయితే, మూడు దేశాలు కాకుండా ఇంగ్లండ్‌ను కలుపుకుని నాలుగు దేశాల సిరీస్‌ను ఏర్పాటు చేయాలని రమీజ్ రాజా ఐసీసీని కోరాడు. తాజాగా హాక్లీ వ్యాఖ్యలతో మరోసారి భారత్-పాక్ సిరీస్ అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, భారత్-పాకిస్థాన్ మధ్య ముక్కోణపు సిరీస్ జరగడం దాదాపుగా అసాధ్యమని భారత క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2023 వరకు టీమిండియా షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్‌లు తలపడనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23న జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇదివరకే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్ -
నేడు ఆసీస్‌తో భారత్ అమీతుమీ
మెల్బోర్న్: పొట్టి ప్రపంచకప్‌కు ముందు ముక్కోణపు టైటిల్ పట్టాలని భారత్, ఆస్ట్రేలియా మహిళలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇరు జట్ల మధ్య బుధవారం టి20 ఫైనల్ పోరు జరుగనుంది. ఇంగ్లండ్ కూడా పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌ల తర్వాత మూడు జట్లూ నాలుగేసి పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో మెరుగైన రన్‌రేట్‌తో భారత్, ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఆసీస్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ధాటిగా ఆడటంతో కొండంత లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. బౌలింగ్‌లో దీప్తి, రాజేశ్వరి గైక్వాడ్, రాధ యాదవ్‌లు కూడా తమ స్థాయి మేరకు రాణిస్తే ఆసీస్‌ను మళ్లీ కంగుతినిపించి కప్ కొట్టడం భారత్‌కు కష్టమేమీ కాదు. -
ముక్కోణపు టి20 : ఫైనల్లో భారత్
మెల్బోర్న్: మహిళల టి20 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 16 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత మూడు జట్లూ నాలుగేసి పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా (0.23), భారత్ (–0.07) ఈనెల 11న జరిగే టైటిల్ పోరుకు అర్హత సాధించగా... ఇంగ్లండ్ (–0.16) జట్టు నిష్క్రమించింది. -
మెరిసిన షఫాలీ వర్మ, స్మృతి
మెల్బోర్న్: ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ఆసీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 173 పరుగులు చేసింది. యాష్లే గార్డెనర్ (57 బంతుల్లో 93; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో మూడు వికెట్లకు 177 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (28 బంతుల్లో 49; 8 ఫోర్లు, సిక్స్), స్మృతి మంధాన (48 బంతుల్లో 55; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 85 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అనంతరం జెమీమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 20 నాటౌట్; సిక్స్), దీప్తి శర్మ (4 బంతుల్లో 11 నాటౌట్; 2 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంతో భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకుంది. టి20ల్లో భారత్‌కిదే అత్యుత్తమ ఛేజింగ్ కావడం విశేషం. -
ప్రపంచకప్ సన్నాహకం
కాన్బెర్రా: వచ్చే నెలలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌కు ముందు మూడు అగ్రశ్రేణి జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టి20 ముక్కోణపు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌లు ఈ నెల 12న జరిగే ఫైనల్లో తలపడతాయి. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే పోరుతో టోర్నీ ప్రారంభం కానుంది. రెండేళ్ల క్రితం వెస్టిండీస్ గడ్డపై జరిగిన టి20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్ వరకు వచ్చి ఇంగ్లండ్ చేతిలో ఓడింది. అయితే కొత్త కోచ్ డబ్ల్యూవీ రామన్ నేతృత్వంలో టీమ్ ఆట ఇటీవల బాగా మారిపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఓపెనర్ స్మృతి మంధాన, జెమీమాలే ఇప్పటి వరకు బ్యాటింగ్ భారం మోస్తుండగా ఇతర ప్లేయర్లు కూడా మెరుగయ్యారు. ముఖ్యంగా టీనేజ్ సంచనలం షఫాలీ వర్మ ఆట జట్టుకు అదనపు బలంగా మారింది. -
ముక్కోణపు వన్డే సిరీస్ మనదే
►శ్రేయస్ అయ్యర్ అజేయ శతకం ►ఫైనల్లో దక్షిణాఫ్రికా ‘ఎ’పై విజయం ప్రిటోరియా: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ (131 బంతుల్లో 140 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఇప్పటిదాకా జరిగిన నాలుగు రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ల్లో కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించని అతను మంగళవారం నాటి తుది పోరులో మాత్రం చివరి బంతి వరకు నిలిచి దుమ్ము రేపాడు. ఫలితంగా ప్రొటీస్ జట్టుపై భారత్ ‘ఎ’ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో నాలుగేళ్ల క్రితం గెలుచుకున్న ముక్కోణపు సిరీస్‌ను తిరిగి నిలబెట్టుకున్నట్టయ్యింది. విజయ్ శంకర్ (86 బంతుల్లో 72; 9 ఫోర్లు) కూడా రాణించాడు. అఫ్ఘానిస్తాన్ ‘ఎ’ జట్టు కూడా ఈ సిరీస్‌లో పాల్గొంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 267 పరుగులు చేసింది. బెహర్డీన్ (114 బంతుల్లో 101 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకం సాధించగా... ప్రిటోరియస్ (61 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. శార్దుల్ ఠాకూర్‌కు మూడు, సిద్దార్థ్ కౌల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 46.5 ఓవర్లలో మూడు వికెట్లకు 270 పరుగులు చేసి నెగ్గింది. అయ్యర్, శంకర్ కలిసి మూడో వికెట్‌కు 141 పరుగులు జత చేశారు. కెప్టెన్ మనీష్ పాండే (38 బంతుల్లో 32 నాటౌట్; 1 సిక్స్) ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు నాటౌట్‌గానే నిలిచి శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు దాదాపుగా చోటు ఖాయం చేసుకున్నాడు. -
వీల్‌చెయిర్లతో దివ్యాంగుల టి-20
-
వీల్‌చెయిర్లతో దివ్యాంగుల టి-20 క్రికెట్!
ఇప్పటివరకు మనం అంధుల క్రికెట్ వరల్డ్ కప్ చూశాం. కానీ దివ్యాంగులు వీల్ చెయిర్లలో కూర్చుని క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు కాదు.. 2009 నుంచే ఈ తరహా క్రికెట్ మన దేశంలో మొదలైంది. ఇప్పటికి యూపీ, హరియాణా, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా జట్లు ఉన్నాయి. త్వరలోనే అంటే.. ఈ సంవత్సరం మే నెలలో నేపాల్‌లో టి-20 వీల్‌చెయిర్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నారు. అందుకోసం ముందుగా దేశంలో ఉన్న ఆరు రాష్ట్రాలకు చెందిన జట్ల మధ్య పోటీలు నిర్వహించి, వాటన్నింటిలోంచి ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి జాతీయ జట్టును కూడా రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే జైపూర్‌లోని చౌగన్ స్టేడియంలో జాతీయ ట్రయాంగ్యులర్ టి-20 వీల్‌చెయిర్ క్రికెట్ సిరీస్ ఒకటి జరిగింది. దివ్యాంగులు పోటా పోటీగా ఇందులో పాల్గొన్నారు. ఫీల్డర్లయితే కుర్చీలోంచి కిందకు జారి డైవ్ చేసి మరీ.. బంతిని ఆపడం లాంటి విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ఇటీవలి వరకు రాజస్థాన్ క్రీడాకారులు కూడా ఢిల్లీ జట్టుకు ఆడేవారు. కానీ ఇప్పుడు వాళ్ల సొంత జట్టు రూపొందింది. ఈ జట్టు త్రికోణ సిరీస్‌లో పంజాబ్ జట్టును ఫైనల్స్‌లో ఓడించింది. ఇప్పటివరకు భారతదేశంలోని ఆరు రాష్ట్రాల జట్లలో కేవలం పంజాబ్‌కు చెందిన రోహిత్ అన్హోత్రా మాత్రమే సెంచరీ చేశారు. స్పోర్ట్స్ వీల్ చెయిర్ ఖరీదు దాదాపు 35వేల రూపాయల వరకు ఉంటుందని, చాలామంది దాన్ని కొనుక్కునే స్థోమత లేక, సాధారణంగా పేషెంట్లకు వాడే వీల్చెయిర్నే వాడతారని రోహిత్ చెప్పాడు. అవి బాగా నెమ్మదిగా కదులుతాయని, పైగా వాటిని వాడితే ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని అన్నాడు. అంతేకాదు, వీళ్లు ప్రాక్టీసు చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతోంది. వీల్‌చెయిర్లను పిచ్ మీద, గ్రౌండ్లోను అనుమతిస్తే అవి పాడవుతాయని క్రికెట్ సంఘాల వాళ్లు అంటున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)