స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నీలో న్యూజిలాండ్ జట్టు బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 9) జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. బంగ్లాదేశ్‌ను 137 పరుగులకే కట్టడి చేసింది. కివీస్ బౌలర్లు బౌల్ట్ (2/25), సౌథీ (2/34), బ్రేస్‌వెల్ (2/14), సోధీ (2/31) మూకుమ్మడిగా విజృంభించడంతో బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ శాంటో (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఫీఫ్ హొసేన్ (24, నరుల్ హసన్ (25 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆఖర్లో నరుల్ వేగంగా (12 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) పరుగులు సాధించడంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
రాణించిన కాన్వే.. చెలరేగిన ఫిలిప్స్
బంగ్లాదేశ్ నిర్ధేశించిన 138 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (9 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగలు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (30) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్ తలో వికెట్ పడగొట్టారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టిన బ్రేస్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీలో తదుపరి మ్యాచ్ అక్టోబర్ 11న న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment