
సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ముక్కోణపు సిరీస్‌లో యువ భారత జట్టు విజయపరంపర కొనసాగుతుంది.
ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించిన భారత్.. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ను మరోసారి చిత్తు చేసింది.
ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత అండర్ 19 జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నమన్ తివారీ (7-1-11-4), ప్రియాన్షు మోలియా (5-0-15-2), ఆరాధ్య శుక్లా (6-1-20-2), ధనుశ్ గౌడ (8-2-23-2) ధాటికి 33 ఓవర్లలో 88 పరుగులకే చాపచుట్టేసింది.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లు కాగా.. నసీర్ హస్సన్ (31), సోహిల్ ఖాన్ (21), రహీముల్లా జుర్మతై (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆదర్శ్ సింగ్ (52 నాటౌట్) అర్దసెంచరీతో రాణించడంతో కేవలం 12.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. మహాజన్ 12 పరుగులకు ఔట్ కాగా.. ముషీర్ ఖాన్ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. అల్లా ఘజన్ఫర్‌కు మహాజన్ వికెట్ దక్కింది.
ఈ సిరీస్లో జనవరి 6న జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో భారత్.. సౌతాఫ్రికాతో తలపడనుంది. 8వ తేదీన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్, జనవరి 10న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment