
మెల్‌బోర్న్: మహిళల టి20 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 16 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత మూడు జట్లూ నాలుగేసి పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా (0.23), భారత్ (–0.07) ఈనెల 11న జరిగే టైటిల్ పోరుకు అర్హత సాధించగా... ఇంగ్లండ్ (–0.16) జట్టు నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment