కాన్‌బెర్రా: వచ్చే నెలలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌కు ముందు మూడు అగ్రశ్రేణి జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టి20 ముక్కోణపు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌లు ఈ నెల 12న జరిగే ఫైనల్లో తలపడతాయి. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే పోరుతో టోర్నీ ప్రారంభం కానుంది. రెండేళ్ల క్రితం వెస్టిండీస్ గడ్డపై జరిగిన టి20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్ వరకు వచ్చి ఇంగ్లండ్ చేతిలో ఓడింది. అయితే కొత్త కోచ్ డబ్ల్యూవీ రామన్ నేతృత్వంలో టీమ్ ఆట ఇటీవల బాగా మారిపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఓపెనర్ స్మృతి మంధాన, జెమీమాలే ఇప్పటి వరకు బ్యాటింగ్ భారం మోస్తుండగా ఇతర ప్లేయర్లు కూడా మెరుగయ్యారు. ముఖ్యంగా టీనేజ్ సంచనలం షఫాలీ వర్మ ఆట జట్టుకు అదనపు బలంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment