మహిళల టీ20 ప్రపంచకప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని న్యూజిలాండ్ ముద్దాడింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో కూడిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది.
ఈ టీమ్‌కు దక్షిణాఫ్రికా సారథి లారా వోల్‌వార్ట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వోల్‌వార్ట్ తన అద్భుత కెప్టెన్సీ, ప్రదర్శనతో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చింది. 12 మంది సభ్యుల ఈ టీమ్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల నుంచి చెరో ముగ్గురికి అవకాశం లభించింది.
ఈ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఒక్కరికే చోటు దక్కింది. . భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైనా నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి హర్మన్ 2 అర్ధ సెంచరీలు సహా 133.92 స్ట్రయిక్ రేట్‌తో 150 పరుగులు సాధించింది.
జట్టు వివరాలు: లారా వోల్‌వార్ట్ (కెప్టెన్), తజీమిన్ బ్రిట్స్, నాన్‌కులులెకొ ఎమ్‌లాబా (దక్షిణాఫ్రికా), అమేలియా కెర్, రోజ్‌మేరీ మెయిర్, ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్), డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), డానీ వ్యాట్ (ఇంగ్లండ్), మెగాన్ షుట్ (ఆ్రస్టేలియా), నిగార్ సుల్తానా (బంగ్లాదేశ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్).
Comments
Please login to add a commentAdd a comment