
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ప్రొటీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడంతో పాటు సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.
న్యూజిలాండ్‌పై విజయానంతరం సఫారీ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ఈ గెలుపు మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఓవరాల్‌గా అదిరిపోయే ప్రదర్శన. డికాక్, డస్సెన్ అద్భుతంగా ఆడారు. మంచి భాగస్వామ్యాన్ని అందించారు. మా బౌలర్లు అనుకున్న ప్రకారం ప్లాన్ పక్కాగా అమలు చేశారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో నేను, క్విన్నీ (డికాక్) పరిస్థితులను అంచనా వేసేందుకు నిదానంగా ఆడాం. చెడ్డ బంతులను బౌండరీలకు తరలించాం. క్విన్నీ 30వ ఓవర్ వరకు నిదానంగా ఆడి, ఆ తర్వాత మా బిగ్ హిట్టర్‌లతో కలిసి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లు మాపై ఎదురుదాడికి దిగుతారని తెలుసు. అలా జరిగితేనే మాకు అవకాశాలు వస్తాయని అంచనా వేశాం.
గత కొంతకాలంగా మేం ఆచరిస్తున్న వ్యూహాలే ఈ మ్యాచ్‌లోనూ అమలు చేశాం. ఈ విజయం మాకు సెమీస్ స్థానాన్ని ఖరారు చేసేలా కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాం. తదుపరి జరిగే మ్యాచ్‌లపై మరింత ఫోకస్ పెంచుతామని అన్నాడు.
కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment