![W T20 World Cup 2023: Australia thrash New Zealand by 97 runs in Paarl - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/12/Australia.jpg.webp?itok=jzMNv2O1)
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం పార్ల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 76 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డనర్ 5 వికెట్లతో చెలరేగగా.. స్కాట్ రెండు, బ్రౌన్, పెర్రీ తలా వికెట్ సాధించారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కెర్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో హీలీ (55), లానింగ్(41), పెర్రీ(40) పరుగులతో రాణించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో తాహు, అమేలియా కెర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఆస్ట్రేలియా తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం బంగ్లాదేశ్ తలపడనుండగా.. న్యూజిలాండ్ సోమవారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
చదవండి: T20 World Cup: పాక్‌తో పోరుకు భారత్ ‘సై’
Comments
Please login to add a commentAdd a comment