ఆ్రస్టేలియా మహిళల జట్టు భారత్ పాలిట దుర్భేద్యమైన ప్రత్యర్థి. ప్రపంచకప్, పతకం (కామన్వెల్త్ గేమ్స్) తెచ్చే మ్యాచ్‌ల్లో మనల్ని రన్నరప్‌గా మార్చిన జట్టు. ఒత్తిడిలో చిత్తుచేసే అలాంటి ఘనమైన ప్రత్యరి్థని ఈసారి భారత మహిళలు చిత్తు చేశారు. మొదట భారీ స్కోరు చేస్తే దాన్ని మనమ్మాయిలు సమం చేశారు. తొలిసారి ‘సూపర్ ఓవర్’ ఒత్తిడిని భారత్ జయిస్తే... ఆసీస్ మూడోసారి తడబడి ఓడింది. అమ్మాయిల క్రికెట్ అంటే మనం ఏ ప్రపంచకప్పో లేదంటే ఫైనల్ మ్యాచో ఉంటేనే కన్నేస్తాం! సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని ఆడినా అటువైపే కన్నెత్తి చూడం. ఇకపై ఈ చిన్నచూపు మాయం కానుంది. ఎందుకంటే భారత అమ్మాయిల ఆట కూడా ‘సూపర్’ టెన్షన్ తెస్తోంది. కాబట్టి మనందరి అటెన్షన్ మారబోతోంది.
ముంబై: అట్లుంటది మనతోని! అని ఇన్నాళ్లు పురుషుల క్రికెటే భారత్‌లో కాలర్ ఎగరేసింది. ఉత్కంఠ రేపినా... ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టినా... ‘సూపర్ ఓవర్’ అయినా పురుషాధిక్య క్రికెట్టే శాసించింది. తొలిసారి ఉత్కంఠ ఉరిమి, భారీస్కోర్లు సమమైతే... ‘సూపర్ ఓవర్’ కిక్‌లో తామేమీ తక్కువ కాదని భారత అమ్మాయిల క్రికెట్ జట్టు నిరూపించింది. తమకెదురైన భారీ స్కోరుకు దీటుగా మెరుపులు మెరిపించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (49 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రిచా ఘోష్ (13 బంతుల్లో 26 నాటౌట్; 3 సిక్సర్లు) ఉత్కంఠభరిత పోరులో భారత్‌ను నిలబెట్టారు.
‘సూపర్ ఓవర్లో’నూ భారీ షాట్లతో భారత్‌ను గెలిపించారు. ఎవరి ఊహకందని ఈ మహిళల రెండో టి20 మ్యాచ్‌లో భారత్ ‘సూపర్ ఓవర్’లో 4 పరుగుల తేడాతో ప్రపంచ చాంపియన్ ఆ్రస్టేలియాపై గెలిచింది. మొదట ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. బెత్ మూనీ (54 బంతుల్లో 82 నాటౌట్; 13 ఫోర్లు), తాలియా మెక్‌గ్రాత్ (51 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. అనంతరం భారత్ కూడా 20 ఓవర్లలో 5 వికెట్లకు సరిగ్గా 187 పరుగులు చేసింది. స్మృతి, రిచా ధనాధన్ ఆట ఆడారు.
దీంతో మ్యాచ్ ‘టై’ కాగా ఫలితం తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. ఇందులోనూ రిచా సిక్స్ కొట్టి నిష్క్రమించగా, స్మతి 4, 6లతో అదరగొట్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది.
‘సూపర్ ఓవర్’ సాగిందిలా...
భారత్ 20/1 బంతి ఆ్రస్టేలియా 16/1
రిచా ఘోష్ (6) అలీసా హీలీ (4)
రిచా ఘోష్ (అవుట్) అలీసా హీలీ (1)
హర్మన్‌ప్రీత్ (1) గార్డెనర్ (అవుట్)
స్మృతి మంధాన (4) తాలియా (1)
స్మృతి మంధాన (6) అలీసా హీలీ (4)
స్మృతి మంధాన (3) అలీసా హీలీ (6)
బౌలర్: హీతెర్ గ్రాహమ్ బౌలర్: రేణుక సిం
చితగ్గొట్టిన మూనీ, తాలియా
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా జట్టు... ఓపెనర్, కెపె్టన్ అలీసా హీలీ (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ధాటిగా ఆడిన ఆమెను దీప్తి శర్మ బోల్తా కొట్టించింది. కానీ ఆ తర్వాత బెత్ మూనీ, తాలియా మెక్‌గ్రాత్ ఆఖరి 20వ ఓవర్‌దాకా ఆటాడుకున్నారు. బౌండరీలతో భారత బౌలర్ల భరతం పట్టారు. దీంతో 13వ ఓవర్లోనే ఆసీస్ స్కోరు 100 దాటింది. మొదట తాలియా 37 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్), కాసేపటికి మూనీ 38 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వీరి జోరు పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. దీంతో అబేధ్యమైన రెండో వికెట్‌కు వీరిద్దరు 158 పరుగులు జోడించారు.
స్మృతి ధనాధన్...
షఫాలీ వర్మ (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్)తో ఓపెనింగ్‌కు దిగిన స్మృతి దంచేసింది. ఇద్దరు 8.4 ఓవర్లలోనే 76 పరుగులు చేశారు. జెమీమా (4) నిరాశపరచగా, హర్మన్‌ప్రీత్ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో స్మృతి చెలరేగింది. 37 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. వరుస ఓవర్లలో హర్మన్, స్మృతి ని్రష్కమించగా... భారత్ విజయానికి 21 బంతుల్లో 39 పరుగులు కావాలి. ఓటమి ఖాయమైన దశలో రిచా భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాల్సి ఉండగా... రిచా, దేవిక తొలి 5 బంతుల్లో 9 పరుగులు చేశారు. ఇక ఆఖరి బంతికి విజయం కోసం 5 పరుగులు అవసరం కాగా, బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా దేవిక బౌండరీ బాదడంతో స్కోర్లు సమమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment