శ్రీలంకతో నిన్న (జులై 30) జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. టీ20ల్లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించడం భారత్‌కు ఇది నాలుగో సారి. బౌల్ ఔట్‌తో కలుపుకుని ఐదో సారి. భారత్ ఇప్పటివరకు ఆడిన ప్రతి సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై రెండు సార్లు, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకపై చెరో సారి టీమిండియా సూపర్ విక్టరీలు సాధించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి అన్నే పరుగులు చేయగలిగింది.
భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేయగా.. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్‌డౌన్ బ్యాటర్ (46) పర్వాలేదనిపించారు.
లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. వాషింగ్టన్ సుందర్ దెబ్బకు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు (3 బంతుల్లో) కోల్పోయింది. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment