( ఫైల్ ఫోటో )
ఆస్ట్రేలియా మహిళా జట్టు రెగ్యూలర్ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ ఎంపికైంది. మూడు ఫార్మాట్లలోనూ మేగ్ లానింగ్ వారసురాలిగా హేలీని నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఆసీస్ జట్టు వైస్ కెప్టెన్‌గా తహ్లియా మెక్‌గ్రాత్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా మేగ్ లానింగ్ గైర్హజరీలో చాలా సిరీస్‌లలో హీలీనే ఆసీస్ జట్టుకు సారథ్యం వహించింది.
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లలో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ హీలీ వ్యవహరించింది. ఇక ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత హీలీ స్పందించింది. ‘ఆసీస్ సారథిగా ఎంపికైనందకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. జట్టును నడిపించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా జట్టు సభ్యులు ఎంతో సహకారం అందించారు’ అని హేలీ తెలిపింది.
కాగా హీలీకి ఫ్రాంచైజీ క్రికెట్‌లో కూడా సారధిగా అనుభవం ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ఆమె సారధిగా కొనసాగుతోంది. మహిళల బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా కొన్ని సీజన్లలో సిడ్నీ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. కాగా ఆస్ట్రేలియా పురుషల జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్యనే హీలీ అన్న సంగతి తెలిసిందే.
Introducing our official @AusWomenCricket leadership duo!
— Cricket Australia (@CricketAus) December 8, 2023
Congratulations to Alyssa and Tahlia 👏 pic.twitter.com/soNHQXQPOz
Comments
Please login to add a commentAdd a comment