భారత మహిళల జట్టుతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమెకు డిప్యూటీగా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది.
అదే విధంగా మాజీ ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌కు ఆస్ట్రేలియా జట్టు తరపున చోటు దక్కింది. కాగా గతంలో ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన గార్త్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున దేశీవాళీ క్రికెట్ ఆడుతోంది. దేశీవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన గార్త్‌కు జాతీయ జట్టు తరపున చోటు దక్కింది.
మరోవైపు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కూడా ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్‌లు ముంబై వేదికగానే జరగనున్నాయి. డిసెంబర్ 9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్‌ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్.
చదవండి: IND vs NZ: 'న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సూర్యకుమార్ స్థానంలో అతడు రావాలి'
Comments
Please login to add a commentAdd a comment