Laning
-
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! కెప్టెన్ దూరం
భారత మహిళల జట్టుతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమెకు డిప్యూటీగా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. అదే విధంగా మాజీ ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌కు ఆస్ట్రేలియా జట్టు తరపున చోటు దక్కింది. కాగా గతంలో ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన గార్త్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున దేశీవాళీ క్రికెట్ ఆడుతోంది. దేశీవాళీ క్రికెట్లో అదరగొట్టిన గార్త్‌కు జాతీయ జట్టు తరపున చోటు దక్కింది. మరోవైపు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కూడా ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్‌లు ముంబై వేదికగానే జరగనున్నాయి. డిసెంబర్ 9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్. చదవండి: IND vs NZ: 'న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సూర్యకుమార్ స్థానంలో అతడు రావాలి' -
సెమీస్‌లో ఇంగ్లండ్ మహిళలు
ధర్మశాల: ఇంగ్లండ్ జట్టు టి20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నెగ్గి మూడో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయినా ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసి... వికెట్ తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చేసింది. స్టెఫానీ టేలర్ (35), క్వింటిన్ (25) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 109 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు బ్యూమోంట్ (31), ఎడ్వర్డ్స్ (30) రాణించారు. పాక్ మహిళలకు రెండో విజయం న్యూఢిల్లీ: పాకిస్తాన్ మహిళల జట్టు.... రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 113 పరుగులు చేసింది. ఫర్గానా హక్ (36) రాణించింది. పాకిస్తాన్ 16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (53 నాటౌట్), బిస్మా (43 నాటౌట్) చెలరేగి ఆడారు. ఆస్ట్రేలియా మహిళల గెలుపు ఆస్ట్రేలియా జట్టు కూడా రెండో విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. ఆసీస్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసి నెగ్గింది. విలాని (39 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు), లానింగ్ (53 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో నిలిచారు.