ధర్మశాల: ఇంగ్లండ్ జట్టు టి20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నెగ్గి మూడో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయినా ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసి... వికెట్ తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చేసింది. స్టెఫానీ టేలర్ (35), క్వింటిన్ (25) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 109 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు బ్యూమోంట్ (31), ఎడ్వర్డ్స్ (30) రాణించారు.
పాక్ మహిళలకు రెండో విజయం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మహిళల జట్టు.... రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 113 పరుగులు చేసింది. ఫర్గానా హక్ (36) రాణించింది. పాకిస్తాన్ 16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (53 నాటౌట్), బిస్మా (43 నాటౌట్) చెలరేగి ఆడారు.
ఆస్ట్రేలియా మహిళల గెలుపు
ఆస్ట్రేలియా జట్టు కూడా రెండో విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. ఆసీస్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసి నెగ్గింది. విలాని (39 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు), లానింగ్ (53 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో నిలిచారు.
సెమీస్‌లో ఇంగ్లండ్ మహిళలు
Published Fri, Mar 25 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement