దక్షిణాఫ్రికాకు తొలి విజయం | T-20 Women's World Cup South Africa's first win | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాకు తొలి విజయం

Published Thu, Mar 24 2016 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

T-20 Women's World Cup South Africa's first win

చెన్నై: టి20 మహిళల ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన  ప్రొటీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ట్రిషా చెట్టి (35 బంతుల్లో 35; 4 ఫోర్లు), లిజెల్లే లీ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించగా చివర్లో క్లో ట్రియాన్ (7 బంతుల్లో 20; 2 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడింది. కిమ్ గార్త్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 89 పరుగులు మాత్రమే చేసింది. లెగ్ స్పినర్ సునే లూస్ 8 పరుగులకు 5వికెట్లు తీయడంతో జట్టు కోలుకోలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement