మహిళల బిగ్ బాష్ లీగ్-2024లో హోబర్ట్ హరికేన్స్ మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఘన విజయాన్ని హోబర్ట్ అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ లిజెల్ లీ విధ్వంసకర సెంచరీతో మెరిసింది.
సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన లీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ప్రత్యర్ధి బౌలర్లను ఈ దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఊచకోత కోసింది. ఆమెను ఆపడం పెర్త్ స్కార్చర్స్ బౌలర్లు వంతు కాలేదు. ఆమె బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు.
ఓవరాల్‌గా 75 బంతులు ఎదుర్కొన్న లీ..12 ఫోర్లు, 12 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీథర్ గ్రహమ్(23) రాణించింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో హోబర్ట్ హరికేన్స్ 3 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం లక్ష్య చేధనలో పెర్త్ జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. హోబర్ట్ బౌలర్లలో హీథర్ గ్రహమ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్మిత్, స్ట్రానో తలా రెండు వికెట్లు సాధించారు. పెర్త్ బ్యాటర్లలో అనిస్‌వర్త్(41) ఒంటరి పోరాటం చేసింది.
అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా లీ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్రేస్ హ్యారీస్(136 నాటౌట్) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యారీస్ అల్‌టైమ్ రికార్డును లీ బ్రేక్ చేసింది.
చదవండి: BAN vs AFG 2nd Odi: మెరిసిన షాంటో.. అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment