T-20 Womens World Cup
-
సెమీస్‌లో ఆసీస్ మహిళలు
న్యూఢిల్లీ: టి20 మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం తమ చివరి గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆసీస్ 13.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ ఎల్సీ విలానీ (43) టాప్ స్కోరర్. అజేయ న్యూజిలాండ్: అద్భుత ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ జట్టు లీగ్ మ్యాచ్‌లను అజేయంగా ముగించింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 19.3 ఓవర్లలో 99 పరుగులు చేసింది. అనంతరం కివీస్ 14.3 ఓవర్లలో మూడు వికెట్లకు 100 పరుగులు చేసి గెలిచింది. -
సెమీస్‌లో ఇంగ్లండ్ మహిళలు
ధర్మశాల: ఇంగ్లండ్ జట్టు టి20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నెగ్గి మూడో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయినా ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసి... వికెట్ తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చేసింది. స్టెఫానీ టేలర్ (35), క్వింటిన్ (25) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 109 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు బ్యూమోంట్ (31), ఎడ్వర్డ్స్ (30) రాణించారు. పాక్ మహిళలకు రెండో విజయం న్యూఢిల్లీ: పాకిస్తాన్ మహిళల జట్టు.... రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 113 పరుగులు చేసింది. ఫర్గానా హక్ (36) రాణించింది. పాకిస్తాన్ 16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (53 నాటౌట్), బిస్మా (43 నాటౌట్) చెలరేగి ఆడారు. ఆస్ట్రేలియా మహిళల గెలుపు ఆస్ట్రేలియా జట్టు కూడా రెండో విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. ఆసీస్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసి నెగ్గింది. విలాని (39 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు), లానింగ్ (53 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో నిలిచారు. -
దక్షిణాఫ్రికాకు తొలి విజయం
చెన్నై: టి20 మహిళల ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ట్రిషా చెట్టి (35 బంతుల్లో 35; 4 ఫోర్లు), లిజెల్లే లీ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించగా చివర్లో క్లో ట్రియాన్ (7 బంతుల్లో 20; 2 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడింది. కిమ్ గార్త్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 89 పరుగులు మాత్రమే చేసింది. లెగ్ స్పినర్ సునే లూస్ 8 పరుగులకు 5వికెట్లు తీయడంతో జట్టు కోలుకోలేకపోయింది. -
న్యూజిలాండ్ మహిళల హ్యాట్రిక్
ఆస్ట్రేలియాపై విజయం నాగ్‌పూర్: తమ పురుషుల జట్టుకు తగ్గట్టుగానే టి20 మహిళల ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. సోమవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది కివీస్‌కు వరుసగా మూడో విజయం. దీంతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 103 పరుగులు చేసింది. కివీస్ ఆఫ్ స్పిన్నర్ లీగ్ కాస్పెరెక్ (13/3) టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తించింది. . ఎలీస్ పెర్రీ (48 బంతుల్లో 42; 3 ఫోర్లు; 1 సిక్స్), జొనాస్సెన్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.లెగ్ స్పిన్నర్ ఎరిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మహిళలు 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 104 పరుగులు చేశారు. ఓపెనర్లు ప్రీస్ట్ (27 బంతుల్లో 34; 5 ఫోర్లు; 1 సిక్స్), బేట్స్ (25 బంతుల్లో 23; 1 ఫోర్; 1 సిక్స్) రాణించడంతో కివీస్ అలవోకగా నెగ్గింది. -
శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు
న్యూఢిల్లీ: టి20 మహిళల ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 110 పరుగులు చేసింది. సురంగిక (31 బంతుల్లో 37; 2 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన కివీస్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 111 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు బేట్స్ (37 బంతుల్లో 37; 4 ఫోర్లు), ప్రీస్ట్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు.