Proteas
-
ఏది నమ్మాలో అర్థం కావట్లేదు: డివిలియర్స్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు మాజీ ప్లేయర్, విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ మళ్లీ సారథ్యం వహించనున్నాడంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. జట్టు సారథ్య బాధ్యతలు తీసుకోవాలంటూ క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) బోర్డు తనను సంప్రదించినట్లు వచ్చిన వార్తల్ని స్వయంగా డివిలియర్స్ ఖండించాడు. అలాంటిదేం లేదంటూ ట్విట్టర్ వేదికగా డివిలియర్స్ స్పష్టం చేశాడు. ‘ప్రొటీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని సీఎస్ఏ నన్ను అడిగిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఈ రోజుల్లో ఏ వార్త నమ్మాలో తెలియట్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని ఏబీ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. -
ఆస్ట్రేలియాకు ఊహించని షాక్
దుబాయ్: టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు మరో షాక్ తగిలింది. తమ ప్రమేయం లేకుండానే టెస్టు ర్యాంకుల్లో కంగారూల జట్టు మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా టీమ్ రెండో ర్యాంకుకు ఎగబాకింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ 1-1తో డ్రా కావడంతో సఫారీలకు రెండో స్థానం దక్కింది. చివరి టెస్టులో ఆఖరిరోజు ఆటకు వరుణుడు అడ్డుపడడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. సఫారీల ఓటమి ఖాయమనుకున్న దశలో వర్షం రావడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు. చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించివుంటే దక్షిణాఫ్రికా మూడో ర్యాంకులోనే కొనసాగేది. వర్షం రూపంలో ఆ జట్టుకు కలిసొచ్చింది. 109 రేటింగ్ పాయింట్లతో సఫారీ టీమ్ రెండో స్థానానికి చేరుకుంది. ఒక పాయింట్ తేడాతో ఆస్ట్రేలియా రెండో ర్యాంకు కోల్పోయింది. ఆసీస్ 108 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. 122 రేటింగ్ పాయింట్లతో భారత్ టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. ర్యాంకుతో పాటు సొమ్ములను స్మిత్ సేన కోల్పోయింది. రెండో ర్యాంకులో ఉన్న జట్టుకు 5 లక్షల డాలర్లు, మూడో స్థానంలో ఉన్న టీమ్ కు 2 లక్షల డాలర్లు దక్కుతాయి. ర్యాంకు పతనంతో ఒక్క రోజు తేడాలో ఆసీస్ జట్టుకు 3 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందన్న మాట. -
దక్షిణాఫ్రికాకు తొలి విజయం
చెన్నై: టి20 మహిళల ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ట్రిషా చెట్టి (35 బంతుల్లో 35; 4 ఫోర్లు), లిజెల్లే లీ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించగా చివర్లో క్లో ట్రియాన్ (7 బంతుల్లో 20; 2 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడింది. కిమ్ గార్త్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 89 పరుగులు మాత్రమే చేసింది. లెగ్ స్పినర్ సునే లూస్ 8 పరుగులకు 5వికెట్లు తీయడంతో జట్టు కోలుకోలేకపోయింది.