గెబెర్హా: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా లంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగు లకే పరిమితమైంది.
హర్షిత (34)దే అత్యధిక స్కోరు. అనంతరం ఆసీస్ 15.5 ఓవర్లలో వికెట్ కో ల్పోకుండా 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (43 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (53 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు.
చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్
Comments
Please login to add a commentAdd a comment