India W Vs Australia W T20 Series- న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో తన ఎడంచేతి పేస్ బౌలింగ్‌తో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి తొలిసారి భారత టి20 జట్టులోకి ఎంపికైంది. ఆస్ట్రేలియా జట్టుతో ముంబైలో ఈనెల 9 నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో అంజలికి చోటు లభించింది.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి ఇటీవల జాతీయ సీనియర్ మహిళల టి20 టోర్నీలో ఇండియన్ రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 17 వికెట్లతో టాపర్‌గా నిలిచింది.
ఆసీస్‌తో సిరీస్‌కు భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్
చదవండి: IND-W vs AUS_W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ఆల్ రౌండర్ దూరం
Comments
Please login to add a commentAdd a comment