మహిళల కబడ్డీ జట్టు
జకార్త: భారత మహిళల కబడ్డీ జట్టు హ్యాట్రిక్ స్వర్ణం మిస్సయ్యింది. ఏషియన్స్ గేమ్స్‌లో భాగంగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళలు 24-27 తేడాతో తృటిలో పసిడిని చేజార్చుకున్నారు. ఒకవైపు పురుషుల జట్టు తొలిసారి సెమీఫైనల్లో ఓడి నిరాశపరచగా.. మహిళలు సైతం ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. హోరాహొరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరాన్ మహిళలే పై చేయి సాధించారు. అద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈమ్యాచ్‌కు ఇరు దేశాల పురుషుల జట్లు హాజరై తమ జట్లకు మద్దతు పలికాయి.
మ్యాచ్ సందర్భంగా పురుషుల జట్టు కెప్టెన్ అజయ్ ఠాకుర్ కన్నీటీ పర్యంతమయ్యాడు. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండు సార్లు భారత మహిళలే స్వర్ణం సాధించారు. తొలిసారి ఇరాన్ మహిళల జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఇక భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 5 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment