మహిళల కబడ్డీ జట్టు
జకార్తా: ఏషియన్ గేమ్స్-2018లో భారత మహిళల కబడ్డీ జట్టు శుభారంభం చేసింది. జపాన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 42-12 తేడాతో ఘనవిజయం సాధించింది. మమతా పుజారి నేతృత్వంలోని భారత మహిళల జట్టు తొలి నుంచి ఆధిపత్యం కనబర్చింది. ఈ మ్యాచ్‌లో జపాన్ మహిళలు ఏదశలోనూ డిఫెండింగ్ చాంపియన్‌కు పోటీనివ్వలేకపోయారు.
ఇండోనేసియా రాజధాని జకార్తాలోని జలోరా బంగ్ కర్నొ స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటలకు పద్దెనిమిదో ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పురుషుల కబడ్డీ జట్టు తొలి మ్యాచ్ శ్రీలంకతో సాయంత్రం 5.30కు ప్రారంభం కానుంది. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ (రవి కుమార్, అపూర్వీ చండేలా)లు ఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment